Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓడిపోయినా ఇదే సంబరం నాయనా?.. పాక్ ఆర్మీ చీఫ్‌ను ముద్దుపెట్టుకున్న అఫ్రిది(వీడియో)

IND vs PAK: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సైనిక వివాదం ముగిసిన తర్వాత కూడా ఇంకా చాలా గందరగోళం కొనసాగుతోంది. భారీ నష్టాలను చవిచూస్తున్నప్పటికీ పాకిస్థాన్ తన ఓటమిని కూడా వేడుకలాగా జరుపుకుంటోంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను కలిశాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా మునీర్‌ను కలిశాడు.

అసీమ్ మునీర్‌ను ముద్దు పెట్టుకున్న షాహిద్ అఫ్రిది
భారత్‌తో సైనిక వివాదం తర్వాత పాకిస్థాన్‌లో చాలా అశాంతి నెలకొంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను కలిశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు అసిమ్ మునీర్‌ను కలిసిన వెంటనే అతడిని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరు ఆటగాళ్లు అసిమ్ మునీర్‌ను ముద్దు పెట్టుకున్నారు. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆర్మీ చీఫ్‌ను ముద్దు పెట్టుకుంటూ కౌగిలించుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. భారత్‌తో జరిగిన వివాదంలో పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూసినా సంబరాలు చేసుకుంటూ ప్రపంచం ముందు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. లోలోపల కుమిలిపోతూనే బయటకు వేడుకలు అంటూ దానిని కవర్ చేస్తోంది.

Shahid Afridi Kisses Pakistan Army Chief After India Clash Sparks Outrage

పాకిస్థాన్ ఏం చేస్తోంది?
భారత్ చేసిన సైనిక దాడుల తర్వాత పాకిస్థాన్ ఆర్థికంగా, సైనికంగా, దౌత్యపరంగా భారీ నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ అక్కడి నాయకులు, మాజీ క్రికెటర్లు దీనిని విజయంగా పేర్కొంటూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పాకిస్థాన్ అలా వేడుకలను ఎందుకు జరుపుకుంటుందో అర్థం చేసుకోవడం అక్కడి ప్రజలకు కష్టమే కానీ.. క్షేత్రస్థాయిలో వాస్తవికత వేరేలా ఉంది.

ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిశారు. ఈ సమావేశం ఇస్లామాబాద్‌లోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని అఫ్రిది అన్నారు. శత్రువుకు తగిన సమాధానం ఇచ్చామని పేర్కొన్నారు. దీనికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అఫ్రిదికి కృతజ్ఞతలు తెలిపారు. దేశం, సాయుధ దళాలకు సంఘీభావం తెలిపినందుకు అఫ్రిదిని ఆయన ప్రశంసించారు. ర్యాలీని విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన అభినందనలు తెలిపారు.

Story first published: Monday, May 19, 2025, 9:48 [IST]
Other articles published on May 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+