For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shahid Afridi : పాక్ జట్టులో ఉన్న నలుగురు అంతంతమాత్రమే.. ఆ భారత ప్లేయర్ లాంటోడు టీంలో ఒక్కడు ఉన్నా..!

Shahid Afridi Intresting Comments About Pakistan Team, He Feels Pak Team Need Hardik like Finisher

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రస్తుత టీం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడగా ప్రదర్శన కనబర్చకపోవడాన్ని ఎత్తి చూపాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ - 2022కి ముందు పాకిస్థాన్ పలు అంశాలు మెరుగుపరుచుకోవాలని కూడా పిలుపునిచ్చాడు. ఇకపోతే పాక్ జట్టుకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే.. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్, ఫినిషర్ జట్టులో లేకపోవడమేనని తెలిపాడు. ఉన్న ప్లేయర్లలో ఫినిషింగ్ స్కిల్స్ అంత గొప్పగా ఏమీ లేవని చెప్పాడు.

టీ20ల్లో ప్రస్తుతం అత్యుత్తమ ఆల్రౌండర్‌గా

టీ20ల్లో ప్రస్తుతం అత్యుత్తమ ఆల్రౌండర్‌గా

ఇక హార్దిక్ తన గాయం నుంచి కోలుకున్న తర్వాత గొప్పగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్ 2022లో ఏకంగా గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్సీ వహించి తొలి సీజన్లోనే టైటిల్ కూడా అందించాడు. ఇటీవల టీమిండియా తరఫున కూడా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా రాణిస్తున్నాడు. టీ20లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా కూడా హార్దిక్ పేరు సంపాదించుకున్నాడు. అతను 2022 ఆసియా కప్‌లో 50పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 17బంతుల్లో 33పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. అతను ఆస్ట్రేలియాపై కూడా అదే తరహా ప్రదర్శన కనబరిచాడు. ఇక డిసైడర్ మ్యాచ్‌లో కీలక 25పరుగులు చేసి విజయలాంఛనాన్ని ముగించాడు. తద్వారా సిరీస్ 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది.

పాక్ క్రికెటర్లలో కన్సిస్టెన్సీ లేదు

పాక్ క్రికెటర్లలో కన్సిస్టెన్సీ లేదు

ఇటీవల ముగిసిన 2022ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంకపై పాకిస్థాన్ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏడు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో 2-2తో సమంగా ఉంది. ఇక ప్రస్తుత పాకిస్థాన్ జట్టులో హార్దిక్ లాంటి ఫినిషర్ లేరా అని అఫ్రిదీని కొందరు హోస్ట్ అడగ్గా అందుకు అవునంటూ అతను బదులిచ్చాడు. స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌తో సహా పాక్ క్రికెటర్లలో కన్సిస్టెన్సీ లేదని ఎత్తి చూపాడు. 'హార్దిక్ పాండ్యా లాంటి ఫినిషర్ మాకు లేడు. ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ మంచి ఫినిషింగ్ ఇస్తారనుకుంటే వాళ్లు పెద్దగా ఆకట్టుకోవట్లేదు. నవాజ్ కూడా అంత గొప్ప కన్సిస్టెన్సీ మెయింటెన్ చేయట్లేదు. షాదాబ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ నలుగురు ఆటగాళ్లలో కనీసం ఇద్దరైన కన్సిస్టెన్సీ మెయింటెన్ చేయాలి. షాదాబ్ బౌలింగ్ జట్టుకు చాలా కీలకం. అతను బౌలింగ్లో రాణించిన రోజున పాకిస్థాన్ గెలుస్తుంది' అని షాహిద్ అఫ్రిది సమా టీవీ షోలో చెప్పాడు.

అమీర్ జమాల్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందే

అమీర్ జమాల్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందే

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాక్ గెలవాలంటే బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మెరుగుపడాలని షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. 26ఏళ్ల ఈ అన్‌క్యాప్‌డ్ పేసర్ అయిన అమీర్ జమాల్‌ను ఆల్‌రౌండర్‌గా తుది జట్టులోకి తీసుకోవాలని కూడా అతను టీమ్ మేనేజ్‌మెంట్‌కు సలహా ఇచ్చాడు. జమాల్ ప్రస్తుత జట్టులో భాగమైనప్పటికీ.. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి నాలుగు మ్యాచ్‌లలో అతన్ని ఆడించలేదు. దీనిపై అఫ్రిది మాట్లాడుతూ.. 'ఇప్పుడు ఆడుతున్న పిచ్‌లలో.. ఇద్దరు నిజమైన ఫ్రొఫెషనల్ పేసర్లు, ఒక ఆల్ రౌండర్ టీంకు కావాలి. కొత్త ప్లేయర్ జమాల్‌ను ఆల్రౌండర్‌గా ఎందుకు ఆడించకూడదు. అతనిని బౌలింగ్ చేయించొచ్చు. బ్యాటింగ్లోను ఉపయుక్తమైన ప్లేయర్. అతను ఎలాంటి క్రికెటరో అవకాశమిస్తేనే కదా మీకు తెలిసేది. పాకిస్థాన్ ప్రపంచకప్ గెలవాలని అనుకుంటే.. జట్టు తప్పకుండా బౌలింగ్, బ్యాటింగ్‌ విషయాల్లో చాలా కృషి చేయాలి. గత కొన్ని మ్యాచ్‌లలో చేసిన తప్పులను తగ్గించుకోవాలి' అని షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు.

Story first published: Wednesday, September 28, 2022, 10:00 [IST]
Other articles published on Sep 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+