For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి అఫ్రిది అక్కసు.. శ్రీలంక క్రికెటర్లపై ఐపీఎల్‌ ఒత్తిడి ఉంది!!

Shahid Afridi fire on IPL, Sri Lankan Players boycott Pakistan Tour

కరాచీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ), ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. పాకిస్తాన్ పర్యటనకు రాకుండా శ్రీలంక ఆటగాళ్లను బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యాలు బెదిరించిందని షాహిద్ అఫ్రిది ఆరోపించారు. ఐపీఎల్‌ను ముడిపెట్టి లంక క్రికెటర్లపై ఒత్తిడి తేవడంతోనే ఆ దేశానికి చెందిన 10 మంది క్రికెటర్లు పాక్‌ పర్యటనకు రాలేమంటూ తెల్చేశారని అఫ్రిది మండిపడ్డాడు.

ఐపీఎల్‌ ఒత్తిడి ఉంది:

ఐపీఎల్‌ ఒత్తిడి ఉంది:

తాజాగా ఓ వీడియో ఇంటర్యూలో అఫ్రిది మాట్లాడుతూ... 'శ్రీలంక ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల ఒత్తిడిలో ఉన్నారు. గతంలో పీఎస్‌ఎల్‌లో ఆడటానికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. ఆ సమయంలో నేను వారితో మాట్లాడినపుడు పాక్‌ పర్యటనకు రావాలని ఉందని వారే చెప్పారు. ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ల పాక్‌ పర్యటనకు రానుంటున్నారు. దీని వెనుక ఐపీఎల్‌ యాజమాన్యం ఉంది. పాక్‌ టూర్‌కు వెళితే ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వమని బెదిరింపులకు పాల్పడి ఉంటారు' అని అఫ్రిది మండిపడ్డాడు.

అండగా ఉన్నాం:

అండగా ఉన్నాం:

'శ్రీలంక క్రికెటర్లు ఇక్కడ పర్యటించకుండా బీసీసీఐ ఒత్తిడి తీసుకొస్తుంది. శ్రీలంక క్రికెట్‌ బోర్డు తమ దేశ పర్యటనకు అనుమతి ఇచ్చినా.. దాన్ని కూడా లెక్కచేయడం లేదంటే ఏమనుకోవాలి. ఎప్పుడూ శ్రీలంక క్రికెట్‌ జట్టుకు అండగా ఉన్నాం. పేలుళ్లు జరిగిన సందర్భాల్లో కూడా పాక్ జట్టు పర్యటించింది. మా అండర్-19 జట్టును కూడా పంపాం. ఇప్పుడు వారు అలా చేయడం సమంజసం కాదు. పాకిస్తాన్ వెళ్ళడానికి వారి కాంట్రాక్ట్ ఆటగాళ్ళపై లంక బోర్డు ఒత్తిడి చేయాలి. పాక్ పర్యటనకు వచ్చే శ్రీలంక ఆటగాళ్లను గుర్తుంచుకుంటాం' అని అఫ్రిది పేర్కొన్నాడు.

 పాకిస్తాన్‌కు లంక:

పాకిస్తాన్‌కు లంక:

అయితే పాకిస్తాన్‌కు తమ జట్టును పంపడానికి శ్రీలంక క్రికెట్‌ బోర్డు గురువారం నిర్ణయం తీసుకుంది. గతవారం సెక్యూరిటీ సంబంధించి అనుమానాలు తలెత్తడంలో పాక్‌తో సిరీస్‌ డైలమాలో పడింది. అక్కడ భద్రతకు సంబంధించి ఎటువంటి భయం లేదని భరోసా లభించడంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు పెద్దలు ఎట్టకేలకు తమ జట్టును పాక్‌ పర్యటనకు పంపడానిక అంగీకరించారు. సీనియర్‌ ఆటగాళ్లు లసిత్‌ మలింగా, కరుణరత్నే సహా 10 మంది పాక్‌ పర్యటనను నిరాకరించిన విషయం తెలిసిందే.

Story first published: Friday, September 20, 2019, 15:55 [IST]
Other articles published on Sep 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+