
ఒకే ఒక వ్యక్తి కారణం:
తాజాగా షాహిద్ ఆఫ్రిది ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ... 'భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ అధికారంలో ఉన్నంత వరకు భారత్ నుంచి మనకు స్పందన రాదు. భారతీయులు సహా మనందరికీ మోడీ ఎలా ఆలోచిస్తారో తెలుసు. ఆయన తిరోగమన ఆలోచనా ధోరణితో ఉన్నారు' అని అన్నాడు.

మోడీ ఎజెండా ఏంటో:
'సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి మరొకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ.. భారత ప్రధాని మోడీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని సూచిస్తున్నాయి. అసలు మోడీ ఎజెండా ఏంటో, ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థమవ్వడం లేదు' అని అఫ్రిది అంటున్నాడు. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి మాట్లాడుతూ భారత క్రికెట్‌ను మెచ్చుకున్నాడు.

ఐపీఎల్ భారత క్రికెట్‌ను మార్చింది:
'ఐపీఎల్ భారత క్రికెట్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అగ్రశ్రేణి విదేశీ ఆటగాళ్లతో భారత యువకులు ఆడుతున్నారు, డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చినప్పుడు సవాళ్లకు సిద్ధంగా ఉంటున్నారు. ఐపీఎల్ భారత క్రికెట్‌ను మార్చిందని నేను భావిస్తున్నా. పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా అదే చేస్తుందనుకుంటున్నా. ఇప్పటికే మేము కొంతమంది ప్రతిభ గల యువ ఆటగాళ్లను లీగ్ ద్వారా చూస్తున్నాం. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడినప్పుడు యువకులు ఒత్తిడిని ఎలా జయించాలో నేర్చుకుంటారు' అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టోర్నీలలో మాత్రమే:
భారత జట్టు చివరిసారిగా రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో 2006లో పాక్‌లో పర్యటించింది. 2008లో 26/11 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో.. అప్పటినుంచి టీమిండియా పాక్ గడ్డపై అడుగు పెట్టలేదు. ఐసీసీ వేదికగా జరిగిన టోర్నీలలో మాత్రమే దాయాదులు తలపడుతున్నారు. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరిగింది. 2012-13లో చివరి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. అప్పుడు పాక్ జట్టు ఇక్కడ పర్యటించింది.


Click it and Unblock the Notifications












