
టెస్టు క్రికెట్‌కు చోటు లేదనేది నా అభిప్రాయం
ఖలీజ్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ "ప్రస‍్తుత కాలంలో టెస్టు క్రికెట్‌కు చోటు లేదనేది నా అభిప్రాయం. నా కెరీర్‌లో కూడా టెస్టు క్రికెట్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. వన్డే క్రికెట్ ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదించా. టెస్టు ఫార్మాట్‌లో ఎక్కువ ఎంజాయ్‌మెంట్ అనేది ఉండదని, కాకపోతే నేటి శకంలో ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ను బలవంతంగా ఆడతున్నారనే నేను భావిస్తున్నా" అని అన్నాడు.

బలవంతంగా చేయాల్సి రావడాన్ని నేను ఇష్లపడను
"నా వరకూ అయితే ఏదైనా ఏదైనా పనిని బలవంతంగా చేయాల్సి రావడాన్ని నేను ఇష్లపడను. ఒక క్రికెటర్ తన కెరీర్‌ను సుదీర్ఘ కాలం కాపాడుకోవాలంటే అది పరిమిత ఓవర్ల క్రికెట్ వల్లే సాధ్యం. తక్కువ ఓవర్ల క్రికెట్ అనేది ఆటగాళ్లకు ఎక్కువగా లాభిస్తుంది. టీ20, టీ10లు వల్ల ఆటగాళ్లు తమ కెరీర్‌ను సుదీర్ఘ కాలం కాపాడుకోవచ్చు" అని పెద్దగా నవ్వుతూ అఫ్రిది చెప్పాడు.

చివరగా గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడిన అఫ్రిది
దాదాపు మూడు నెలల క్రితం కెనడా వేదికగా జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో పాల్గొన్న షాహిది అఫ్రిది.. తాజాగా అప్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో పాక్తియా పాంథర్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ సందర్భంగా ఖలీజ్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన అఫ్రిది టెస్టు క్రికెట్‌పై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

వన్డేల్లో ఎనిమిదివేలకు పైగా పరుగులు చేసిన అఫ్రిది
కెనడా టీ20 లీగ్‌లో ఎడ్‌మొన్టన్ రాయల్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహించిన అఫ్రిది మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో 1, 5, 2, 13 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, పాక్ తరుపున 27 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన అఫ్రిది 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో ఎనిమిదివేలకు పైగా పరుగులు, 395 వికెట్లను అఫ్రిది పడగొట్టాడు. ఈ క్రమంలో అనేక రికార్డులను అఫ్రిది తన ఖాతాలో వేసుకున్నాడు.


Click it and Unblock the Notifications












