Fact Check: షాహిద్ అఫ్రిది కన్నుమూత!!(వీడియో)
Fact Check Shahid Afridi Death: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరణించాడు. వాస్తవానికి సోషల్ మీడియాలో వెలువడిన ఒక వీడియో క్రికెట్ ప్రపంచాన్ని కదిలించింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించాడని ఆ వీడియోలో చెబుతున్నారు. భారత వ్యతిరేక ప్రకటనల కారణంగా కొన్ని రోజుల క్రితం వరకు షాహిది అఫ్రిది వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సమయంలో షాహిద్ అఫ్రిది భారత సైన్యాన్ని, భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక సార్లు ప్రకటనలు చేశాడు. అసలు నిజం ఏమిటో తెలుసుకుందాం.
ఈ వైరల్ వీడియోలో పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించాడని చెబుతున్నారు. ఆయనను కరాచీలో ఖననం చేశారని.. విజన్ గ్రూప్ ఛైర్మన్‌తో సహా చాలా మంది అధికారులు కూడా సంతాపం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు చేసినప్పుడు ఈ వైరల్ వీడియో ఏఐతో తయారు చేయబడిందని తేలింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. అఫ్రిది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతని మరణ వార్త అబద్ధం.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రభుత్వం చాలా మంది పాకిస్థాన్ క్రికెటర్లు, షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్‌తో సహా అనేక మంది ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను నిషేధించింది. షాహిద్ అఫ్రిది చాలా సంవత్సరాల క్రితం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. చాలా కాలంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు.
షాహిద్ అఫ్రిది క్రికెట్ కెరీర్‌ను పరిశీలిస్తే అతను 2017లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అఫ్రిది 11 వేలకు పైగా పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలో మొత్తం 541 వికెట్లు తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ అఫ్రిది పేరు మీద ఉంది. తన వన్డే కెరీర్‌లో షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లు కొట్టాడు. ఈ విషయంలో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అతనికి కేవలం 7 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications