కనేరియాపై వివక్ష: కుమార్తె హారతి సీన్ చూసిందని టీవీ పగలగొట్టిన షాహిద్ అఫ్రిది (వీడియో)

హైదరాబాద్: ఓ టీవీ 'షో'ని చూస్తూ తన కుమార్తె హారతి ఇవ్వడాన్ని చూసి ఇంట్లో గోడకు ఉన్న టీవీని పగలుగొట్టానని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అప్రిది చెప్పాడు. గతంలో ఓ ఛానెల్‌కు అఫ్రిది ఇచ్చిన ఇంటర్వ్యూని అమిత్ కుమార్ సింధి అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది.

ఓ టీవీ షోలో
మూడు రోజుల క్రితం ఓ టీవీ షోలో పాక్ మాజీ పేసర్ షోయర్ అక్తర్ మాట్లాడుతూ డానిష్ కనేరియాపై పాక్ జట్టులో కొందరు వివక్ష చూపించారని వెల్లడించాడు. అక్తర్ చెప్పిన వ్యాఖ్యలను కనేరియా సైతం సమర్ధించాడు. అక్తర్ చెప్పింది వాస్తవమని, తాను ఆడుతున్న రోజుల్లో ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేక చెప్పలేకపోయానని అన్నాడు.

కనేరియాపై అక్తర్ చేసిన వ్యాఖ్యలపై
కనేరియాపై అక్తర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. పాక్‌లో హిందువులకు భద్రత లేదని, పాకిస్థాన్ క్రికెట్‌లో కూడా వివక్ష ఉందని పలువురు గళమెత్తారు. కనేరియా విషయంలో పాక్ వైఖరిని కొందరు సమర్ధించగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం పాక్ జట్టులో అలాంటి వివక్ష తాను చూడలేదని అన్నాడు.

తన కెరీర్‌లో అత్యధిక శాతం
కనేరియా తన కెరీర్‌లో అత్యధిక శాతం తన కెప్టెన్సీలో ఆడాడని చెప్పిన ఇంజమామ్ "కనేరియా అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. పాకిస్తానీయులు పెద్ద హృదయాలు కలిగి ఉన్నారని నా అభిప్రాయం. వారు ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు" అని అన్నాడు. ఇలాంటి తరుణంలో అఫ్రిది వీడియో కొత్త వివాదానికి తెరలేపింది.
టీవీని ఎప్పుడైనా బద్దలు కొట్టారా?
టీవీని ఎప్పుడైనా బద్దలు కొట్టారా? అని ఆ వీడియోలో యాంకర్ అఫ్రిదిని ప్రశ్నించగా... "నా భార్య కారణంగా ఒకసారి టీవీని పగలకొట్టాను. పిల్లలతో కాకుండా ఒంటరిగా టీవీని చూడాలని నా భార్యకు ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు ఓ ఛానెల్లో ‘షో'లు ఎక్కువగా వచ్చేవి. ఆ ఛానెల్ ‘షో'ని చూస్తూ నా కుమార్తె హారతి ఇవ్వడం చూశాను. దీంతో టీవీని బద్దలుకొట్టాను" అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications