Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ప్రేమపై పాక్‌లో ఆగ్రహం: షాహిద్ అఫ్రిది వివరణ

కోల్‌కతా: పాకిస్తాన్‌లో కన్నా భారత్‌లోనే తమను ప్రేమించే అభిమానులు ఎక్కువ అని వ్యాఖ్యానించిన పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రీది చిక్కుల్లో పడ్డారు. దీనిపై సొంత దేశంలో విమర్శలు వెల్లువెత్తడంతో అతను తన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకున్నాడు.

భారత్‌లోని అభిమానులకు పాజిటివ్ మెసేజ్ ఇచ్చేందుకు వ్యాఖ్యానించానని చెప్పాడు. షాహిద్ అఫ్రిది ఆడియో సందేశాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ట్విట్టర్‌లో ఉంచింది. పాకిస్తాన్ అభిమానులను చులకన చేయాలనేది తన ఉద్దేశ్యం కాదని చెప్పాడు.

తాను కేవలం పదకొండు మందితో కూడిన క్రికెట్ జట్టుకు మాత్రమే కెప్టెన్‌ను కాదని, మొత్తం పాకిస్తాన్ ప్రజల గౌరవానికి ప్రతీకను అన్నాడు. తన వ్యాఖ్యలను పాజిటివ్ దృక్పథంతో చూడాలన్నారు. పాకిస్తాన్ అభిమానుల కంటే ఎక్కువ అని తన ఉద్దేశ్యం కాదన్నాడు. తనకు గుర్తింపే పాకిస్తాన్ నుంచి వచ్చిందని చెప్పాడు.

 Shahid Afridi clarifies his 'getting more love in India' statement

తనను ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం అలా చెప్పవలసి వచ్చిందని వివరించాడు. తన వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం విన్నదని చెప్పాడు. తన వ్యాఖ్యల ద్వారా ప్రపంచానికి పాజిటివ్ సందేశం ఇవ్వాలనుకున్నానని, భారత్‌లో ఆడటాన్ని తాము ఎంజాయ్ చేస్తామన్నారు.

క్రికెట్‌ను ఆరాదించే భారత దేశంలో తమకు గౌరవం ఉంటుందని వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఇంజుమామ్ హుల్ హక్ వంటి వారు కూడా చెబుతారన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను అడిగినా కూడా భారత్‌లో క్రికెట్ ఓ మతం అని చెబుతాడని తెలిపాడు.

కాగా, పాకిస్థాన్‌ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే తమను ప్రేమించే అభిమానులు ఎక్కువగా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఓ న్యాయవాది ఏకంగా అఫ్రిదీకి లీగల్ నోటీసులు పంపాడు.

టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు కోల్‌కతాలో అగుడుపెట్టిన సందర్భంగా అఫ్రిదీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్‌ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అంటూ అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+