'నీకు సిగ్గులేదా'.. షాహిద్ అఫ్రిదిపై పాక్ ప్రజల ఆగ్రహం!
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియో సందేశం పట్ల పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రవేశాలకు లోనవుతున్నారు. షాహిద్ అఫ్రిది ఇంధన ధరల పెంపుపై చేసిన కామెంట్లు ఆ దేశంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరిన వేళ.. ఆయన ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరడం ఈ వివాదానికి కారణమైంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడిందని.. ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్థాన్ పరిస్థితి మెరుగ్గా ఉందని షాహిద్ అఫ్రిది పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలను ప్రజలు సహనంతో స్వీకరించాలని, దేశాభివృద్ధి కోసం అందరూ సహకరించాలని అఫ్రిది పిలుపునిచ్చారు.
ఆకాశాన్నంటిన ధరలు.. సామాన్యుడి అల్లాటప్పా
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. లీటరు పెట్రోల్‌పై 137 రూపాయలు, డీజిల్‌పై 184 రూపాయలు అదనపు భారం మోపడంతో కొత్త ధరలు వరుసగా.. రూ.458.40, రూ.520 లకు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంధన ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్య పౌరుడికి లీటరు పెట్రోల్ కోసం 450 రూపాయలకు పైగా వెచ్చించడం పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో అఫ్రిది చేసిన "సహకరించండి" అనే కామెంట్స్ ప్రజల గాయాలపై కారం చల్లినట్లు అయ్యాయి.

సోషల్ మీడియాలో "సిగ్గులేని అఫ్రిది" ట్రైండింగ్
షాహిద్ అఫ్రిది వైరల్ కావడంతో పాకిస్థాన్ నెటిజన్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా 'Shameless Afridi' (సిగ్గులేని అఫ్రిది) అనే ట్యాగ్‌తో విమర్శలు గుప్పిస్తున్నారు. "లగ్జరీ కార్లలో తిరిగే కోటీశ్వరుడైన షాహిద్ అఫ్రిదికి, సైకిల్ మీద వెళ్లే సామాన్యుడి కష్టాలు ఎలా తెలుస్తాయి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం వల్ల ఆయనకు వ్యక్తిగత ప్రయోజనాలు ఉండొచ్చని.. అందుకే ప్రజల పక్షాన నిలవకుండా ప్రభుత్వ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉన్న సెలబ్రిటీలే ఇలా భరించమని చెప్పడం బాధ్యతారాహిత్యమని ప్రజలు మండిపడుతున్నారు.
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ప్రభావం
ఈ ధరల పెంపుపై పాక్ ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్నఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా దెబ్బతిందని.. దీని వల్ల దిగుమతి ఖర్చులు పెరిగాయని పాక్ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఈ ఇంధన ధరల పెంపు కోలుకోలేని దెబ్బ అని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సామాన్యుడి ప్రాణాల మీదకు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షాహిద్ అఫ్రిది ఇమేజ్‌కు డ్యామేజ్
మొత్తానికి దేశభక్తి పేరుతో షాహిద్ అఫ్రిది చేసిన ఈ ప్రయత్నం వికటించింది. క్రికెటర్‌గా ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, సామాన్యుల కష్టాల విషయంలో ఆయన చూపిన ఉదాసీనత పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అఫ్రిది కేవలం తన స్వచ్ఛంద సంస్థ కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వివాదం పాకిస్థాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications