న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇమ్రాన్ ఖాన్ ను సమర్ధించిన పాక్ క్రికెటర్

Shahid Afridi backs Pakistan PM Imran Khan’s statement

పుల్వామా ఉగ్ర దాడి భారత్ , పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని స్ఫురిస్తుంది. ఇప్పటికే దేశం మొత్తం పాకిస్తాన్ పై తీవ్ర కోపంతో ఊగిపోతోంది. చాలా మంది పాకిస్థాన్ కు యుద్ధం తోనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా ఉగ్ర దాడి గురించి ఐదు రోజుల తరువాత పాక్ ప్రధాని స్పందించిన సంగతి తెలిసిందే. " భారత్ మా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదని అస్సలు ఆలోచించకుండా తిరిగి దాడి చేస్తామని హెచ్చరించాడు.

టెర్రరిజం పెంచి పోషించడం , లేదా వేరే దేశం మీద కు పంపించడం మాకు కూడా శ్రేయస్కరం కాదని చెప్పుకొచ్చాడు . భారత్ దగ్గర దాడి కి సంబంధించి అధరాలు ఉంటే సమర్పించాలని విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుమంటామని " అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన సంగతి తెలిసిందే. ఇప్పడూ ఇమ్రాన్ వ్యాఖ్యలను పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది సమర్ధించాడు.

"ఈ ఉగ్రదాడి పై ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్పారో అదే వాస్తవమని మమ్మల్ని కావాలని నిందిస్తున్నారు అని "అభిప్రాయ పడ్డాడు. కానీ ఈ ఉగ్రదాడిని మాత్రం ఖండించలేదు. కనీసం ఈ దాడిలో మరణించినవారికి సంతాపం కూడా తెలపలేదు. దాడి జరిగిన 5 రోజుల తరువాత స్పందిస్తూ , అదే పాత డైలాగ్స్‌ చెబుతూ.. తమకేం సంబంధం లేదన్నట్లు మాట్లాడుతోంది. ఉగ్రవాద నిర్మూలనకు తాము సిద్ధమంటూనే.. భారత్ యుద్దానికి సిద్ధమైతే తాము కూడా సిద్ధమని తన అస్సలైన దుర్బుద్ధిని చాటు కున్నది.

ఇక ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఇమ్రాన్‌ స్పందన ఊహించిందేనని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమపై ఆరోపణలు చేస్తోందన్న ఇమ్రాన్‌ వ్యాఖ్యలకు విదేశీ శాఖ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసింది . ముంబై దాడులకు సంబంధించి పాకిస్తాన్‌కు భారత్‌ స్పష్టమైన ఆధారాలు అందచేసినా పదేళ్లకు పైగా ఈ కేసు ముందుకు కదలలేదని గుర్తుచేసింది. పటాన్‌కోట్‌ దాడుల్లోనూ దర్యాప్తు కొలిక్కిరాలేదని ప్రస్తావించింది.

Story first published: Wednesday, February 20, 2019, 8:08 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X