Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తనపై తానే జోకేసుకుని నవ్వులు పూయించిన అఫ్రిది (వీడియో)

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసక ఆటగాళ్లలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఒకరు. తన బ్యాటింగ్ శైలిపై తానే జోకేసుకుని నవ్వులు పూయించిన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన అఫ్రిది తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా తన బ్యాటింగ్‌పై తానే జోకులు పేల్చుతూ అందర్నీ నవ్వించారు. 'అస్సలామాలైకుమ్, నా బ్యాటింగ్ లాగే మీ సమయాన్ని కూడా ఎక్కువ తీసుకోను' అన్నాడు. అఫ్రిది మంచి బ్యాట్స్‌మన్ అయినప్పటికీ, క్రీజులోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడనే పేరుంది.

తాను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ప్రయత్నించడమే ఇందుకు కారణమని చెప్పాడు. ప్రేక్షకుల సమయాన్ని వృథా చేయడం ఇష్టంలేకే తక్కువ బంతుల్లోనే పరుగులు రాబట్టాలని యత్నించి కొద్దిసేపటికే పెవిలియన్ బాట పడతానని చెప్పుకొచ్చాడు.

నా బ్యాటింగ్ తరహాలోనే తక్కువ సమయంలో చిన్న ప్రసంగంతో అభిప్రాయం చెబుతా అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి వచ్చిన తాను ఆ తర్వాత ఆ విభాగంలో తరచూగా విఫలమవుతున్నా.. బౌలింగ్‌తోనే కెరీర్‌ను నెట్టుకొచ్చినట్లు అఫ్రిది వెల్లడించాడు.

పాక్ తరుపున 398 వన్డేలు ఆడిన ఆఫ్రిది 395 వికెట్లు తీసి ఆ దేశ మాజీ లెజెండ్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్‌ల సరసన నిలిచాడు. ఆగస్టులో జరిగిన నాట్‌వెస్ట్‌ టి20 బ్లాస్ట్‌ టోర్నీలో 43 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగి 101 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ20 కెరీర్‌లో ఆఫ్రిదికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+