Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్‌‌లో టీమిండియా కష్టాలు మొదలయ్యాయ్ - బలోపేతమైన పాకిస్తాన్

Shaheen Shah Afridi is all set join the Pakistan team ahead of the T20 World Cup 2022, PCB confirms

ఇస్లామాబాద్: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2022 కోసం సన్నద్ధమౌతోంది. క్రికెట్ ఆడే అన్ని దేశాలు కూడా ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్ కోసం కసరత్తు చేస్తోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా దీన్ని నిర్వహించబోతోండటం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్.. ఇలా టీమ్ ఏ ప్లేయర్లందరూ ఆస్ట్రేలియాలో నెట్ ప్రాక్టీస్‌లో తలమునకలయ్యారు.

22 నుంచి సూపర్ 12

22 నుంచి సూపర్ 12

ఈ నెల 16వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. నెదర్లాండ్స్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడతాయి. 21వ తేదీన స్కాట్లాండ్-జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌తో గ్రూప్స్ దశ ముగుస్తుంది. ఆ తరువాతే అసలు పోరు ఉంటుంది. 22 తేదీ నుంచి సూపర్ 12 మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్.. ఆతిథ్య ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఆ మరుసటి రోజే భారత్.. తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది.

23న భారత్-పాక్ మధ్య మ్యాచ్

23న భారత్-పాక్ మధ్య మ్యాచ్

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఈ నెల 23వ తేదీన భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ మధ్యే ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నమెంట్ తరువాత ఈ రెండు దేశాలు తలపడబోతోండటం ఇదే తొలిసారి అవుతుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ అవుతోంది. ఆసియా కప్ నుంచి టీమిండియా వైదొలగడానికి కారణమైన జట్టును రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది.

అఫ్రిదీ రెడీ..

అఫ్రిదీ రెడీ..

ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్ అందుకుంది. బౌలింగ్ బ్యాక్‌బోన్ షహీన్ షా అఫ్రిదీ రెడీ అయ్యాడు. గాయం వల్ల చాలాకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటూ వచ్చిన ఈ స్పీడ్‌స్టర్.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడటానికి సన్నద్ధం అయ్యాడు. గాయం నుంచి అఫ్రిదీ రికవరీ అయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా ధృవీకరించింది. త్వరలో అతను జట్టుతో కలుస్తాడని తెలిపింది.

వామప్ మ్యాచ్‌కు

వామప్ మ్యాచ్‌కు

ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌తో ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఎల్లుండి ఈ సిరీస్ ముగుస్తుంది. అనంతరం అటు నుంచి అటే ఆస్ట్రేలియాకు వెళ్తుంది. ఈ నెల 17, 19 తేదీల్లో ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో వామప్ మ్యాచ్‌లను ఆడుతోంది బాబర్ సేన. ఈ మ్యాచ్‌లల్లో అఫ్రిదీ ఆడతాడని పీసీబీ స్పష్టం చేసింది. 10 రోజులుగా తాను వందశాతం ఫిట్‌నెస్‌తో ఉంటోన్నానని, రన్ అప్ కూడా మెరుగుపడిందని అఫ్రిదీ చెప్పాడు.

ఊహించినదాని కంటే వేగంగా..

ఊహించినదాని కంటే వేగంగా..

ఊహించిన దానికంటే వేగంగా కోలుకున్నానని, దీనికి సహకరించిన పీసీబీ మెడికల్ అడ్వైజరీ, క్రిస్టల్ ప్యాలెస్ ఫుట్ బాల్ క్లబ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నాడు. షహీన్ షా అఫ్రిది చేరికతో పాకిస్తాన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ మరింత బలోపేతమౌతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. గాయాల వల్ల టీమిండియా బౌలింగ్ బలహీనపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవే గాయాల బారిన పడిన పాక్ బౌలర్లు కోలుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అఫ్రిదీకి టీమిండియా మంచి ట్రాక్ రికార్డ్ ఉండటం ఆందోళనకు గురి చేసే విషయమే.

Story first published: Wednesday, October 12, 2022, 12:37 [IST]
Other articles published on Oct 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+