Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?

Shaheen Afridi marries fiance in presense of his teammates

పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ పెళ్లి చేసుకున్నాడు. తన బంధువు అయిన మాజీ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ కుమార్తెను షహీన్ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా క్రికెట్‌కు షహీన్ దూరమయ్యాడు. గతేడాది ఆసియా కప్‌ సమయంలో మోకాలి గాయంతో ఆ టోర్నీలో ఆడలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ నాటికి అతను కోలుకున్నాడు. ఆ మెగా టోర్నీలో పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా కొంత రాణించాడు.

కానీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు షహీన్. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండి కోలుకుంటున్న అతను శుక్రవారం నాడు షాహిద్ అఫ్రిదీ కుమార్తె అన్షాను నిఖా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో షహీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న లాహోర్ కలందర్స్ జట్టు సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతోపాటు 'లాహోర్ కలందర్స్ నుంచి అంతులేని సంతోషం కలగాలని కోరుకుంటున్నాం' అని పోస్టు పెట్టింది.

Shaheen Afridi marries fiance in presense of his teammates

షహీన్, అన్షా ఇద్దరికీ 2021లోనే నిశ్చితార్థం జరిగింది. వీళ్లిద్దరి వివాహం కోసం ఇరువైపు బంధువులు ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు శుక్రవారం నాడు రెండు కుటుంబాలు కలిసి వివాహం జరిపించారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియోను కూడా లాహోర్ కలందర్స్ నెట్టింట పంచుకుంది. ఈ వివాహ వేడుకకు షహీన్ సహచర ఆటగాళ్లు బాబర్ ఆజమ్, సర్ఫరాజ్ ఖాన్, షాదాబ్ ఖాన్ తదితరులు కూడా హాజరయ్యారు. వీళ్లంతా కలిసి షహీన్ వివాహ వేడుకకు మరింత అందం తెచ్చారని ఈ వీడియోలు చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్నిరోజుల క్రితం తన స్ట్రగుల్ గురించి మాట్లాడిన షహీన్.. ఒకానొక సందర్భంలో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేయాలని అనుకున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, February 4, 2023, 12:32 [IST]
Other articles published on Feb 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+