Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన షాహిన్ అఫ్రిది.. ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డ్!

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 100 వికెట్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించిన తొలి పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత అందుకున్న నాలుగో బౌలర్‌గా షాహిన్ అఫ్రిది రికార్డులకెక్కాడు. అతని కంటే ముందు టిమ్ సౌథి (న్యూజిలాండ్), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), లసిత్ మలింగ (శ్రీలంక) ఈ ఘనత అందుకున్నారు.

అయితే ఈ రికార్డు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా షాహిన్ అఫ్రిది నిలిచాడు. 24 ఏళ్ల 248 రోజుల వయస్సులో షాహిన్ మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మార్క్‌ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు టిమ్ సౌథి పేరిట ఉండేది. సౌథి 32 ఏళ్ల 319 రోజుల వయస్సులో ఈ రికార్డు అందుకున్నాడు. కాగా, డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో షాహిన్ ఈ ఘనత సాధించాడు. పీటర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని టీ20ల్లో 100 వికెట్ల మార్క్ అందుకున్నాడు.

Shaheen Afridi Makes History as First Pakistani Player to Achieve Milestone

అయితే పాకిస్థాన్ తరఫున టీ20ల్లో 100 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌ షాహిన్ అఫ్రిది. అంతకుముందు ఈ ఘనతను హారిస్ రవూఫ్, షాదబ్ ఖాన్ సాధించారు. హారిస్ రవూఫ్ 71 మ్యాచ్‌ల్లో, షాహిన్ 74 టీ20ల్లో 100 వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్థాన్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 183 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (82; 40 బంతుల్లో, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు.

జార్జ్ లిండే (48; 24 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (3/22), అబ్రార్ అహ్మద్ (3/37) చెరో మూడు వికెట్లు, అబ్బాస్ అఫ్రిది (2/30) రెండు, సూఫీ ముఖీమ్ (1/53) ఒక్క వికెట్ తీశారు. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులే చేసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (74; 62 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినప్పటికీ నిదానమైన ఇన్నింగ్స్ జట్టుపై ప్రభావం చూపించింది. జార్జ్ లిండే నాలుగు (4/21) వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, December 11, 2024, 9:37 [IST]
Other articles published on Dec 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+