Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌కు బంగారు బాతును ఇచ్చిన ఆర్సీబీ!

గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ అంటే ఇతర జట్లకు సులువుగా రెండు పాయింట్లు వచ్చినట్లే అని విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతోంది. విధ్వసంకర బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

చెపాక్ వేదికగా ఆదివారం జరగనున్న టైటిల్ పోరు కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. క్వాలిఫయిర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన ఎస్‌‌ఆర్‌హెచ్ క్వాలిఫయిర్-2లో జూలు విదిల్చింది. రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపులో ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ కీలకపాత్ర పోషించాడు. బ్యాటుతో 18 పరుగులు, బంతితో మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్‌ను ఔట్ చేశాడు.

Shahbaz Ahmed Traded from RCB Emerges as a Hero for Sunrisers Hyderabad

క్వాలిఫయిర్-2లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకువచ్చిన నిర్ణయమే సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చింది. ఈ విషయాన్ని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా వెల్లడించడం విశేషం. అయితే ఈ సీజన్‌కు షాబాజ్ అహ్మద్ ట్రేడింగ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి సన్‌రైజర్స్‌కు వచ్చాడు. గత సీజన్‌లో షాబాజ్ ఆశించిన స్థాయిలో సత్తాచాటలేకపోయాడని ఆర్సీబీ అతన్ని ఎస్‌ఆర్‌హెచ్‌కు అప్పగించింది.

అతని స్థానంలో మరో స్పిన్ ఆల్‌రౌండర్ మయాంక్ దాగర్‌ను ఆర్సీబీ జట్టులోకి తెచ్చుకుంది. కానీ ఈ నిర్ణయం బెంగళూరుకు ఏ మాత్రం కలిసిరాలేదు. మయాంక్ విఫలమయ్యాడు. మరోవైపు భారత స్పిన్ ఆల్‌రౌండర్ జట్టులో లేకపోవడం ఆర్సీబీని దారుణంగా దెబ్బతీసింది. స్వప్పిల్ సింగ్, మహిపాల్ లోమ్రర్ ఆల్‌రౌండర్ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. కానీ షాబాజ్ అహ్మద్ మాత్రం సన్‌రైజర్స్‌కు వచ్చిన తర్వాత చెలరేగాడు. వీలైతే బంతితో లేదా బ్యాటుతో సత్తాచాటుతో జట్టులో విలువైన ప్లేయర్‌గా మారాడు.

కీలక మ్యాచ్‌లో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు. సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దీంతో బంగారు బాతు లాంటి షాబాజ్ అహ్మద్‌ను ఆర్సీబీ వదులుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాపం.. ఆర్సీబీ ఇప్పుడు ఫీల్ అవుతుందేమో అని ఫన్నీ పోస్ట్‌లు పెడుతున్నారు. షాబాజ్ అహ్మద్ కోసం రూ.2.4 కోట్లు ఖర్చు పెట్టడం ఎక్కువ అని భావించిన బెంగళూరు సన్‌రైజర్స్‌కు అప్పగించి చెత్త నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు.

Story first published: Saturday, May 25, 2024, 8:44 [IST]
Other articles published on May 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+