Shahbaz Ahmed : నా కల నెరవేరింది.. నాకు అవకాశాలిస్తే మ్యాచ్‌లు గెలిపిస్తా

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో అతని స్థానంలో షాబాజ్ అహ్మద్ ఎంపికైన సంగతి తెలిసిందే. తొలిసారిగా భారత జట్టుకు షాబాజ్ ఎంపికయ్యాడు. 27ఏళ్ల షాబాజ్ బెంగాల్ తరపున దేశవాళీ మ్యాచ్‌లలో రాణించాడు. అతను లిస్ట్-A క్రికెట్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా 47.3సగటుతో ప్రదర్శన కనబరిచాడు.
బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మ్యాచ్ మలుపు తిప్పే ప్లేయర్ అతను. ఇక షాబాజ్ ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరపున 11ఇన్నింగ్స్‌లలో 27.38 సగటుతో 219పరుగులతో ఆకట్టుకున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడు మిడిల్ ఆర్డర్‌లో చాలా కీలకమైన పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 4వికెట్లు తీశాడు.
'ఇండియాలో క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ భారత్ తరఫున ఆడాలని కోరుకుంటారు. భారత జట్టుకు ఎంపికవ్వడమనే నా కల నేడు నిజమైంది. నేను బెంగాల్ తరఫున ఆడినప్పుడు నా శాయశక్తుల ప్రదర్శన కనబరిచాను. బెంగాల్ జట్టు నాపై ఎంతో నమ్మకం ఉంచింది. ఒక్క అవకాశం ఇస్తే.. నా బ్యాటింగ్, బౌలింగ్‌తో మ్యాచ్‌లు గెలిపించగలనని ఆశిస్తున్నాను.
జట్టు నాపై ఆ నమ్మకం ఉంచగలదని నేను ఆశిస్తున్నాను' అని షాబాజ్ తెలిపాడు. బెంగాల్ అసోసియేషన్‌కు, ముఖ్యంగా ఆఫీస్ బేరర్‌లకు ఎప్పుడూ నాపై నమ్మకం ఉంది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నా కోచ్‌లు, జట్టులోని నా సహచర ప్లేయర్లు అందరూ సహకరించారు. వారికి రుణపడి ఉంటాను' అని షాబాజ్ పేర్కొన్నాడు.
జింబాబ్వేతో మూడు వన్డేలకు ఎంపికైన భారత జట్టు:
కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్ ( వైస్ కెప్టెన్ ), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications