For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతా ఆటగాళ్లు నిద్ర పట్టనీయకుండా చేశారు: షారూక్ ఖాన్

Shah Rukh Khan’s tweet for the KKR players will surely win your heart

హైదరాబాద్: ఇప్పటికే లీగ్ పట్టికలో టాప్ 4లో ఒకటిగా నిలిచి ప్లేఆఫ్ రేసుకు దాదాపు కోల్‌కతా ఖరారైపోయింది. టాప్ 4లో నిలిచేందుకు తలపడిన సమరంలో శనివారం టాప్ 1 సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో హోరాహోరీగా పోరాడి గెలిచింది కోల్‌కతా. ఈ విజయం గురించి ఆ జట్టు సహ యజమాని షారూక్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టులోని ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పొగడ్తల పర్వాన్ని కొనసాగించాడు. లీగ్ దశలో కోల్‌కతాకు ఆఖరి మ్యాచ్ కావడంతో జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉన్నా గెలవాలనే బలమైన ఆకాంక్షతో మ్యాచ్‌ను ఆరంభించింది.

నవ్వులు చూడడానికి 24గంటలు నిద్రలేకుండా

'వాళ్ల నవ్వులు చూడడానికి 24గంటలు నిద్రలేకుండా గడిపాను. థాంక్స్ దినేశ్ కార్తీక్, ప్రసిద్ధ్.. మంచి పని చేశావు. రాబిన్ ఊతప్ప ఈ సారి మనమిద్దరం కలిసి ఎక్సర్‌సైజ్ చేద్దాం, లిన్.. అదరగొట్టేశావు. సునీల్ ఎప్పటికీ సునీల్‌యే. ఈ ఆనందంతో నిద్ర పట్టడం లేదు' ఇవి కోల్ కతా విజయం అనంతరం షారూక్ ఖాన్ ట్విట్టర్ మాటలు.

ఉప్పల్‌ స్టేడియంలో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో

ఉప్పల్‌ స్టేడియంలో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో

శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. ఐపీఎల్‌-11లో అద్భుత ప్రదర్శనతో అందరికంటే ముందు ప్లేఆఫ్‌ బెర్తు సాధించిన సన్‌రైజర్స్‌ చివరి దశలో తడబడింది. ప్లేఆఫ్‌ ముంగిట వరుసగా మూడో పరాజయం చవిచూసింది. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (50) టాప్‌స్కోరర్‌. ఓ దశలో 200 పరుగులు సాధిస్తుందనుకున్న సన్‌రైజర్స్‌కు పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ (4/30) అడ్డుకట్ట వేశాడు. కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌ విధ్వంసానికి సన్‌రైజర్స్‌

క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌ విధ్వంసానికి సన్‌రైజర్స్‌

క్రిస్‌ లిన్‌ (55), ఉతప్ప (45) చెలరేగి తమ జట్టును ప్లేఆఫ్‌ చేర్చారు. క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌ (29) విధ్వంసక ఆటతో సన్‌రైజర్స్‌ చిన్నబోయింది. లిన్‌, నరైన్‌ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదడంతో లక్ష్యం వేగంగా కరుగుతూ వచ్చింది. 21 బంతుల్లోనే కోల్‌కతా స్కోరు 50 పరుగులు దాటింది. జోరుమీదున్న నరైన్‌కు షకిబ్‌ పగ్గాలు వేయడంతో సన్‌రైజర్స్‌ శిబిరంలో ప్రాణం లేచొచ్చింది. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌ మొదలుపెట్టడంతో కొద్దిసేపు పరుగుల ప్రవాహం ఆగిపోయింది.

అనవసర షాట్లు ఆడకుండా :

అనవసర షాట్లు ఆడకుండా :

లిన్‌, ఉతప్ప నిదానంగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. అనవసర షాట్లు ఆడకుండా చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. అర్ధసెంచరీ తర్వాత లిన్‌ ఔటయ్యాడు. మ్యాచ్‌లో కోల్‌కతా మంచి స్థితికి చేరుకోగానే ఉతప్ప ఉతకడం మొదలుపెట్టాడు. కోల్‌కతాను లక్ష్యానికి చేరువ చేశాడు. చివర్లో ఉతప్ప ఔటైనా.. దినేశ్‌ కార్తీక్‌ (26 నాటౌట్‌)పని పూర్తిచేశాడు.

Story first published: Sunday, May 20, 2018, 14:37 [IST]
Other articles published on May 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+