స్పెషల్ మెసేజ్: గంభీర్ రిటైర్మెంట్‌పై ట్విట్టర్‌లో షారుక్ ఇలా

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మంగళవారం అనూహ్యంగా క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు 11 నిమిషాల నిడివి కలిగిన వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌చేస్తూ 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
గురువారం నుంచి ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఆంధ్రతో మొదలయ్యే రంజీ మ్యాచ్ తనకు చివరిదని అందులో పేర్కొన్నాడు. గంభీర్ రిటైర్మెంట్‌పై తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ట్విట్టర్‌లో స్పందించాడు. గంభీర్‌ను ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడాడు. మూడు ఫార్మాట్లలో భారత్ తరుపున అనేక చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 2012, 2014లో విజేతగా గెలవడంలో గంభీర్ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో షారుక్ తన ట్విట్టర్‌లో "మీ ప్రేమకు, నాయకత్వానికి కృతజ్ఞతలు కెప్టెన్. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అల్లా ఆశీర్వాదం మీకెప్పుడు ఉండాలి... మీరు ఇంకాస్త నవ్వాలి" అని షారుక్ ట్వీట్ చేశాడు.

2009లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా
2009లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన గంభీర్.. 2016లో ఇంగ్లాండ్‌పై రాజ్‌కోట్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తరుపున ఆడే అవకాశం గంభీర్‌కు లభించలేదు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆంధ్రతో రంజీ మ్యాచ్ నాకు చివరిది
తన రిటైర్మెంట్‌పై గంభీర్ మాట్లాడుతూ "ఆంధ్రతో రంజీ మ్యాచ్ నాకు చివరిది. ఆట ఆరంభించిన ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోనే కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను. భారత్, కేకేఆర్, ఢిల్లీ ఆడిన ప్రతిసారి ఆటను ఆస్వాదించాను. కానీ గత కొన్నేళ్లుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న ప్రతిసారీ ఇట్ ఈజ్ ఓవర్ గౌతీ అన్న మాట నా చెవుల్లో ఇంకా మోగుతూనే ఉంది" అని అన్నాడు.

ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన నిరాశకు గురిచేసింది
"ప్రతిసారి ఆత్మవిశ్వాసం పొందేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. 2017 దేశవాళీ సీజన్‌లో మెరుగ్గా రాణించినా ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన నిరాశకు గురిచేసింది. విమర్శకుల నోళ్లు మూయించడంలో నేను విఫలమయ్యాను. అంతకుముందు కంటే విమర్శల దాడి ఎక్కువైంది. ఈ కారణంగానే 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నా" అని తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications