For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో షారుక్‌ఖాన్‌కు డబుల్ కిక్! కొడుకుతో కలిసి మ్యాచ్ (ఫోటో)

By Srinivas

కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ 8 సందర్భంగా కోల్‌కతా జట్టు యజమాని, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తన తనయుడు అబ్ రామ్‌ను బయటకు తీసుకు వచ్చాడు.

తన తనయుడితో కలిసి మ్యాచ్ చూసిన షారుక్ ఖాన్ మురిసిపోయాడు. తనయుడిని తీసుకు వచ్చిన షారూక్ ఖాన్‌కు.. ఆ తర్వాత కోల్‌కతా గెలుపు డబుల్ కిక్ ఇచ్చింది.

తనకు ఆటలు అన్నా, ఐపీఎల్ అన్నా చాలా ఇష్టమని చెప్పాడు. షారుక్ తన తనయుడితో కలిసి గ్యాలరీలో, పిచ్ పైన కాసేపు హల్ చల్ చేశాడు. కోల్‌కతా గెలిచాక తన తనయుడితో కలిసి మైదానంలోకి వెళ్లాడు. తాను ప్రతి మ్యాచ్‌ చూసేందుకు వస్తానని షారూక్ ఖాన్ ఈ సందర్భంగా చెప్పాడు.

Shah Rukh Khan happy to bring kids to IPL, introduces AbRam to Kolkata

షారుక్ ఖాన్ కోల్‌కతాకు తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన పిల్లలు స్పోర్ట్స్‌ను ఆనందించాలని కోరుకుంటానని చెప్పాడు. తన పిల్లలు గెలుపు, ఓటమిని తెలుసుకోవడం తనకు చాలా సంతోషమని చెప్పాడు.

చాలా రోజుల తర్వాత తన ముగ్గురు పిల్లలతో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చానని, ఇక నుండి అలాగే వస్తానని చెప్పాడు. వీరు చీర్ లీడర్స్ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తాను తనతో పాటు తన పిల్లలను తీసుకు వచ్చానని, తాను తన జట్టును ప్రోత్సహించేందుకు వచ్చానని, నేను ఓ చీర్ లీడర్ అని వ్యాఖ్యానించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+