
హైదరాబాద్: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ చీర్‌లీడర్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని షారూఖ్ ఖాన్.. శనివారం దేశీవాలీ లీగ్‌కు హాజరైయ్యారు. ప్రస్తుతం వెస్టిండీస్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ 6వ సీజన్ జరుగుతోంది. ఆగస్టు 8న ప్రారంభమైన ఈ లీగ్ సెప్టెంబరు 16తో ముగియనుంది. మొత్తం 6 జట్లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి.
ట్రిబాగో నైట్‌రైడర్స్ జట్టుకు షారుక్ ఖాన్ సహ యజమాని. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రిబాగో నైట్‌రైడర్స్- జమైకా తలవాస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు షారుక్ ట్రినిడాడ్ వెళ్లాడు. ఈ సందర్భంగా షారుక్ మైదానంలో కలియ తిరుగుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. చీర్‌లీడర్లు కూడా వచ్చి షారుక్‌కు జత కలియడంతో వారితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
జమైకాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రిబాగో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా, తరువాతి మ్యాచ్ సెయింట్ కిట్స్‌తో నెవిస్ పాట్రియోట్స్‌తో తలపడనుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని అయిన షారుక్.. ఆ జట్టు ఆడే మ్యాచ్‌లకు కుటుంబసభ్యులతో కలిసి హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ కనిపిస్తాడు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తరువాయి చిత్రం 'జీరో'కు ఒక రకంగా ఇది ప్రమోషనల్ అనుకోవచ్చు. ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. ఈ సినిమాలో షారూఖ్ ద్వార్ఫ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇద్దరు హీరోయిన్లు అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలతో రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా గురించి షారూక్‌ను ప్రశ్నించిన మీడియాకు.. దర్శకుడు తననేమీ మాట్లాడవద్దని.. చెప్పాడని అవన్నీ దర్శకుడే చెప్తాడు' అని బదులిచ్చాడు.