నా జీవితంలో ఎప్పుడూ ప్రైవేట్ జెట్ ఎక్కలేదు..షారుఖ్ రియల్ హీరో!ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధం!

ముంబై: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అంటే తనకు ఎనలేని గౌరవమని, ఆయన కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తెలిపాడు. తన జీవితంలో ప్రైవేట్ జెట్ ఎక్కడం కంటే గొప్పది మరోటి లేదని, అది కూడా షారుఖ్ పర్సనల్ జెట్ ఎక్కి తన జన్మను ధన్యం చేసుకున్నానన్నాడు. గత నెలలో ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ద్వారా దినేశ్ కార్తీక్ వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో డీకే తన గొంతు వినిపించాడు. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌కి కూడా అతడు కామెంట్రీ చెప్పనున్నాడు.

క్రికెట్‌పై ఉన్న అభిమానంతో
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ తాను చేసే మంచి పనులను మీడియా, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చెప్పడానికి కాస్త మొహమాటపడుతుంటాడు. తన గురించి ప్రజలకు తెలిసినందున మళ్లీ చెప్పుకోవడం ఎందుకనే ఫిలాసఫీని ఆయన అనుసరిస్తుంటారని సినీ వర్గాలు అంటుంటాయి. షారుఖ్ ఖాన్‌కు దేశవిదేశాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
ఆయన చేసిన సహాయాలపై కూడా ఎన్నోమార్లు చర్చలు జరిగాయి. అయినప్పటికీ తనకు తానుగా ఇది చేశానని అతడు చెప్పడం మనం ఎప్పుడూ చూసుండం. ఇక క్రికెట్‌పై ఉన్న అభిమానంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జ్జట్టుకు సహ యజమానికిగా వ్యవహరిస్తూ.. లోకల్ క్రికెటర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న మహానుభావుడు.

ప్రైవేట్ జెట్‌ను పంపించారు
గౌరవ్ కపూర్స్ పోస్ట్‌కార్డ్‌తో దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకున్నాడు. 'ఎన్ని ఫ్రాంచైజీలు ఇలాంటి గొప్ప పనులు చేస్తాయో నాకు తెలియదు. కోల్‌కతా నైట్ రైడర్స్ నాకు చేసింది నమ్మశక్యం కానిది. నేను దాన్ని అసలు ఊహించలేదు. నా జీవితంలో ప్రైవేట్ జెట్ ఎప్పుడూ ఎక్కలేదు. నేను చెన్నైలో ఉన్న సమయంలో దుబాయ్ వెళ్లేందుకు తన ప్రైవేట్ జెట్‌ను షారుఖ్ ఖాన్ పంపించారు.
షారుఖ్ మాత్రమే అలాంటి చేయగలరు. ఇంతకన్నా ఆయన ఔదార్యత గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది. ఆయనది గొప్ప మనసు' అని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తెలిపాడు. కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు.
శ్రీలంక బౌలర్లతో ఇషాన్ కిషన్ చెడుగుడు..అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ! కృనాల్ తర్వాత అరుదైన రికార్డు!

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్:
'పర్సనల్ లైఫ్‌లో సమస్యలు ఎదురై ఆటుపోట్లకు గురైన సందర్భంలో షారుఖ్ ఖాన్ నాకు అండగా నిలిచి ఆదుకున్నారు. ప్రపంచంలో ఆయనకన్నా గొప్ప హృదయం గల వారు ఇంకెవరూ లేరు. ఇలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరం, ఆయన రీల్ జీవితంలోనే కాకుండా రియల్ జీవితంలో కూడా హీరోనే.
నాకు అండగా నిలిచిన షారుఖ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం' అని డీకే పేర్కొన్నాడు. 'ఓసారి ట్రినిడాడ్ వీధుల్లో వాడా పావ్ తినేందుకు షారుఖ్, నేను ఇద్దరం వెళ్లాం. ఆయనకు అక్కడ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో అతడు క్యాప్ పెట్టుకోవాల్సి వచింది. నేను అతనితో గొప్ప సమయం గడిపాను' అని దినేశ్ కార్తీక్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications