చాలా మంది స్టార్లు ఉన్నా.. కామెంట్రీకి పనికిరారు.. అమితాబ్, షారుఖ్ తప్ప: అకాశ్ చోప్రా

ముంబై: భారత మాజీ టెస్ట్ క్రికెటర్ ఆకాష్ చోప్రా వ్యాఖ్యతగా, విశ్లేషకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు. తన వ్యాఖ్యానంతో ఎంతో మంది అభిమానులతో ప్రశంసలు అందుకున్న టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్.. ప్రస్తుతం వివాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ ఆకాశ్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. ఎంతలా అంటే.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు ఆకాష్ దూరంగా ఉన్నాడు. అయినా కూడా ఆకాశ్ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నాడు.

అమితాబ్, షారుఖ్ తప్ప:
తాజాగా ఓ సందర్భంలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ... బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌లు కామెంట్రీ చేస్తే చాలా బాగుటుందని అన్నాడు. కామెంటేటర్లుగా బాలీవుడ్ నుంచి ఇద్దరు పేర్లు చెప్పమని ఆర్‌కే షోలో ఆకాశ్ చోప్రాని అడగ్గా... 'కచ్చితంగా అమితాబ్, షారుఖ్‌లే. కామెంట్రీకి సమయస్పూర్తి ఉండాలి. వారికి అది చాలా ఉందని నా అభిప్రాయం. బాలీవుడ్లో చాలా మంది స్టార్లు ఉన్నారు.. కానీ వాళ్లు కామెంట్రీకి పనికిరారు. అదే షారుఖ్ మరియు అమిత్‌లు ఏం కావాలన్నా చేయగలరు. వాళ్లు గొప్ప కామెంటేటర్లు అవ్వగలరు' అని బదులిచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌లో వ్యాఖ్యానం:
భారత మాజీ టెస్ట్ క్రికెటర్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌ల పేర్లు చెప్పడంతో సోషల్ మీడియా వేదికగా ఆకాష్ చోప్రాపై మిగతా స్టార్ హీరోల అభిమానులు మండిపడుతున్నారు. అమితాబ్, షారుఖ్ ఇద్దరూ ఐపీఎల్ సీజన్లలో మాజీ భారత క్రికెటర్లతో కలిసి సందడి చేసారు. ఇక తమ మూవీ ప్రొమోషన్స్ కోసం 2016లో టీ20 ప్రపంచకప్‌లోని ఓ మ్యాచుకు హాజరయి తమ వ్యాఖ్యాన నైపుణ్యాలను బయటపెట్టారు. క్రికెట్ పరిజ్ఞానం, బేస్ వాయిస్, హిందీ-ఆంగ్ల భాషలపై వారికున్న పట్టు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అమితాబ్ వాయిస్.

అభిమాని హెలికాఫ్టర్ షాట్:
ఎంఎస్ ధోనీ హెలికాఫ్టర్ షాట్‌ను అంతర్జాతీయ ఆటగాళ్లే కాకుండా చాలా మంది క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఫాన్స్ ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఓ అభిమాని హెలికాఫ్టర్ షాట్ ఆడాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో తాజాగా ఆకాష్ చోప్రా కంట పడింది. ఇక మనోడు ఊకుంటాడా?. వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'గొప్ప హెలికాప్టర్ షాట్‌ను కనుగొన్నాం.. అంతర్జాతీయ క్రికెట్లోకి రావాలంటే కొంత సమయం వేచి ఉండాలి' అని కాప్షన్ రాసుకొచ్చాడు. ధోనీ కంటే బెటర్ హెలికాప్టర్ షాట్ ఇది అని పరోక్షంగా అన్నాడు.

భారత్ తరఫున 10 టెస్టులు:
ఆకాశ్ చోప్రా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక ఏడాది మాత్రమే భారత్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన చోప్రా.. 10 టెస్టులాడి 23 సగటుతో 437 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇక 2004లో కెరీర్‌ని ముగించిన చోప్రా.. కనీసం ఒక్క వన్డే కూడా ఆడలేదు. అనంతరం మ్యాచ్ కామెంటేటర్‌గా మాత్రం సుదీర్ఘకాలంగా విజయవంతంగా కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications