Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షెఫాలీ వర్మపై వేటు..ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత మహిళల జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని మహిళల జట్టును నిర్మిస్తోంది. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తున్న షెఫాలీ వర్మను జట్టు నుంచి తప్పించింది.

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో షెఫాలీ వర్మ 56 పరుగులే సాధించింది. వన్డే ఫార్మాట్‌లో చివరిగా 2022 జులైలో హాఫ్ సెంచరీ చేసింది. ఆ తర్వాత నుంచి కనీసం 50 మార్క్‌ను అందుకోలేకపోయింది. గాయం కారణంగా కివీస్ సిరీస్‌లో తుదిజట్టులో ఆడలేకపోయిన శ్రేయంక్ పాటిల్ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాలేకపోయింది. అలాగే హేమలత, ఉమ ఛెత్రి, సయాలీ కూడా జట్టులో చోటు కోల్పోయారు.

Shafali Verma Excluded from India s ODI Squad for Australia Series

అయితే గతేడాది డిసెంబర్‌లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హర్లీన్ డియోల్‌కు అవకాశం దక్కింది. మరోవైపు ఇంటర్ పరీక్షల కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన రిచా ఘోష్ తిరిగి వచ్చింది. ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టును రెడీ చేయడానికి బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ షెడ్యూల్
తొలి వన్డే: డిసెంబర్ 5- బ్రిస్బేన్
రెండో వన్డే: డిసెంబర్ 8- బ్రిస్బేన్
మూడో వన్డే: డిసెంబర్ 11- పెర్త్

భారత మహిళల జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీప‌ర్‌), రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్.

మరోవైపు హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ భవితవ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్‌తో బీసీసీఐ ప్రత్యేక సమావేశం కానుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే హర్మన్‌ప్రీత్‌నే సారథిగా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. కాగా, న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కొందరు ప్లేయర్లు దూరం కావడంతో.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు సయాలీ సత్‌ఘరే, సైమా ఠాకూర్, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా, మిడిలార్డర్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్‌ తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు.

ఇంటర్ ఎగ్జామ్స్ కారణంగా వికెట్ కీపర్ రిచా ఘోష్ కివీస్ సిరీస్‌కు దూరమైంది. 2020లో 16 ఏళ్ల వయస్సులో రిచా ఘోష్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. మరోవైపు గాయం కారణంగా లెగ్ స్పిన్నర్ ఆశా శోభన జట్టుకు అందుబాటులో లేదు. ఆల్‌రౌండర్ పూజ వస్త్రాకర్‌కు విశ్రాంతి ఇచ్చారు.

భారత జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలి వర్మ, హేమలత, దీప్తిశర్మ, జెమీమా, యాస్తిక, ఉమ ఛెత్రి, సయాలి, అరుంధతిరెడ్డి, రేణుక, తేజల్, సైమా థాకూర్, ప్రియ మిశ్రా, రాధ, శ్రేయంక పాటిల్‌.

Story first published: Tuesday, November 19, 2024, 16:26 [IST]
Other articles published on Nov 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+