చరిత్ర తిరగరాసిన బేబీ సెహ్వాగ్!
ICC Womens World Cup 2025: భారత యువ మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల వరల్డ్ కప్ 2025 ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. షెఫాలీకి వాస్తవానికి వరల్డ్ కప్ జట్టులో చోటుదక్కలేదు. అయితే బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీకా రావల్ గాయపడటంతో ఆమె స్థానంలో షెఫాలీకి జట్టులో అవకాశం లభించింది. ఈ అవకాశం ఆమెకు ఓ వరంలా మారింది. ఆ తర్వాత ఆమె చరిత్ర సృష్టించింది.
షెఫాలీ ఆల్‌రౌండ్ ప్రదర్శన
వరల్డ్ కప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన షెఫాలీ వర్మ, స్మృతి మంధానతో కలిసి 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆమె సెంచరీకి చేరుకోలేకపోయినా కేవలం 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 87 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. బ్యాటింగ్‌తో పాటు ఆమె తన బౌలింగ్‌తో కూడా మ్యాజిక్ చేసింది. షెఫాలీ రెండు కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను దెబ్బతీసింది. ఆమె అద్భుతమైన ప్రదర్శనకు గాను ఆమెకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

ప్రపంచ రికార్డు సృష్టించిన షెఫాలీ వర్మ
షెఫాలీ వర్మ వరల్డ్ కప్ ఫైనల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకోవడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పురుషుల, మహిళల క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ లేదా సెమీ-ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా షెఫాలీ నిలిచింది. ఆమె ఈ ఘనత సాధించే నాటికి ఆమె వయస్సు కేవలం 21 సంవత్సరాల మరియు 279 రోజులు. అంతేకాకుండా ఆమె వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్ధ సెంచరీ (50+), రెండు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్ కూడా.
షెఫాలీ కెరీర్:
*టెస్టులు (5): 567 పరుగులు
*వన్డేలు (31): 741 పరుగులు
*టీ20లు (90): 2221 పరుగులు
*ఉమెన్స్ ప్రీమియర్ లీగ్: ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతుంది. 27 మ్యాచ్‌లలో 865 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications