Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపిన షెఫాలీ.. మిథాలీ తర్వాత రెండో క్రికెటర్‌గా

Shafali Verma becomes 2nd Indian after Mithali Raj to top Womens T20I Rankings

దుబాయ్: భారత మహిళా యువ సంచలనం షెఫాలీ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపింది. మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో 16 ఏళ్ల హర్యానా సంచలనం షెఫాలీ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. గత రెండేళ్లుగా నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్‌ స్టార్ సుజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి టాప్‌ దక్కించుకుంది. ఈ ర్యాంకును కేవలం 18 మ్యాచులు మాత్రమే ఆడి దక్కించుకోవడం విశేషం.

రెండో మహిళా క్రికెటర్‌గా:

రెండో మహిళా క్రికెటర్‌గా:

16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం షెఫాలీ వర్మ 19 స్థానాలను మెరుగుపరచుకొని నెంబర్ వన్ ర్యాంకును చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళా టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ఫర్ఫామెన్స్‌తో షెఫాలీ మొదటి ర్యాంకుకు చేరుకుంది. భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌కు చేరిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. గురువారం ఇంగ్లండ్‌తో జరుగునున్న సెమీస్‌ మ్యాచ్‌కు ముందే నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం.

 ప్రపంచకప్‌లో 161 పరుగులు:

ప్రపంచకప్‌లో 161 పరుగులు:

షెఫాలీ వర్మ టీ20 మ్యాచ్‌లలో 146.96 స్ట్రైక్ రేట్‌తో 485 పరుగులు చేసింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో షెఫాలీ 161 పరుగులు చేసింది. అత్యధికంగా శ్రీలంకపై 47 పరుగులు చేసింది. తాజా ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు చేసి 172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే.

6వ స్థానంలో మంధనా:

6వ స్థానంలో మంధనా:

ప్రస్తుతం షెఫాలీ వర్మ ఖాతాలో 761 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. సుజీ బేట్స్‌ (750), బెత్ మూనీ (746) సోఫీ డివైన్ (742), మెగ్ లానింగ్ (708) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్‌కు చెందిన స్మృతి మంధనా రెండు స్థానాలు దిగజారి 6వ స్థానంలో ఉంది. మరో స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా రెండు స్థానాలు దిగజారి తొమ్మిదవ స్థానంలో ఉంది.

పూనమ్‌ యాదవ్‌ @ 8:

పూనమ్‌ యాదవ్‌ @ 8:

బౌలింగ్‌ విభాగంలో ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫీ ఎక్లేస్టోన్‌ అగ్ర స్థానం దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన సోఫీ.. 8 వికెట్లు ఖాతాలో వేసుకుంది. కాగా భారత మహిళా బౌలర్లు దీప్తీ శర్మ, రాధా యాదవ్ ర్యాంకులు కోల్పోయి.. వరుసగా ఐదు, ఏడో స్థానాల్లో నిలిచారు. మెగా టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన భారత లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ నాలుగు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

Story first published: Wednesday, March 4, 2020, 12:59 [IST]
Other articles published on Mar 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+