హిట్‌మ్యాన్‌కు బౌలింగ్ చేయడం కష్టం.. కాస్త పొరపాటు జరిగితే అంతే సంగతులు: పాక్ స్పిన్నర్

కరాచీ: టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం చాలా కష్టం అని పాకిస్థాన్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ అన్నాడు. హిట్‌మ్యాన్‌కు బౌలింగ్ చేస్తున్నపుడు కాస్త పొరపాటు జరిగితే బంతి వెళ్లి స్టాన్స్‌లోకి వెళుతుందన్నాడు. రోహిత్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు కూడా బౌలింగ్ చేయడం కష్టమని 21 ఏళ్ల షాదాబ్ తెలిపాడు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇరుజట్ల గతేడాది చివరిసారిగా ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో తలపడ్డాయి.

చాట్ షోలో పాల్గొన్న షాదాబ్:
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యావత్ ప్రపంచం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ మహమ్మారిని జయించేందుకు ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదా సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు లాక్‌డౌన్‌కే పరిమితమైనప్పటికీ.. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఓ చాట్ షోలో పాల్గొన్న షాదాబ్ ఖాన్‌ను.. మిమ్మల్ని భయపెట్టిన బ్యాట్స్‌మన్ ఎవరు అని ఓ అభిమాని అడగ్గా.. రోహిత్, స్మిత్ అని చెప్పాడు.

కాస్త పొరపాటు జరిగితే:
'రోహిత్ శర్మకు బౌలింగ్ చేయాలంటే చాలా ఖచ్చితత్వంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. కాస్త పొరపాటు జరిగినా.. బంతి స్టాన్స్‌లోకి వెళుతుంది. ఇక అతనికి అనువైన ప్రదేశంలో ఎటువంటి బంతిని వేసినా.. సిక్సర్ ఖాయం' అని షాదాబ్ తెలిపాడు. గతేడాది భారత్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో షాదాబ్ విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ వేసి 61 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ (140)తో చెలరేగాడు. రోహిత్ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

స్మిత్‌కు ఎదుర్కోవడం సవాలే:
'ఆస్ట్రేలియా పరిస్థితులలో స్టీవ్ స్మిత్‌కు ఎదుర్కోవడం కష్టం. ఆస్ట్రేలియాలోని పిచ్‌లు స్పిన్ బౌలింగ్‌కు అంత అనుకూలంగా ఉండవు. అందుకే ఆసీస్ గడ్డపై అతనికి బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్, స్మిత్‌లు ఎక్కువగా ఇబ్బంది పెట్టారు' అని షాదాబ్ ఖాన్ తెలిపాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జెర్సీని ధరించిన షాదాబ్ ఇటీవల బ్యాట్ మరియు బంతితో అద్భుతంగా రాణించాడు. 43 వన్డేల్లో 59 వికెట్లు పడగొట్టడంతో పాటు 337 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications