For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దొంగదారిలో వచ్చావు.. నోరు మూస్కోని పని చూస్కో!

పాకిస్థాన్ క్రికెట్లో సీనియర్లు, జూనియర్ల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైన తర్వాత పాక్ మాజీ ఆటగాళ్లు ప్రస్తుత జట్టు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే వీరికి బదులిచ్చే క్రమంలో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి.

వివాదానికి కారణం ఏంటి?
పాక్ దిగ్గజాలు షాహిద్ అఫ్రిది, మహమ్మద్ యూసుఫ్ వంటి వారు షాదాబ్ ఖాన్, బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదిలను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన షాదాబ్.. "మాజీలు సాధించలేనిది (వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించడం) మేము సాధించాము" అని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పాక్ మాజీ ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించాయి.

Shadab Khan Controversy He Slams Legends Ahmed Shehzad Hits Back You Entered Pakistan Team via Back Door

'దొంగదారిలో వచ్చావు'.. షెహజాద్ ఫైర్!
పాక్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ ఒక లైవ్ డిబేట్‌లో షాదాబ్ ఖాన్‌ను కడిగిపారేశారు."నువ్వు దొంగదారి (Back door) ద్వారా జట్టులోకి వచ్చావు. దేశీ క్రికెట్‌లో నీకు సరైన ప్రదర్శన లేదు. కేవలం ఫేవరిటిజం (పక్షపాతం) వల్లే నువ్వు జట్టులో కొనసాగుతున్నావు. గాయపడినప్పుడు కనీసం రీహాబ్ కూడా సరిగ్గా చేయలేదు. హసన్ అలీ లాంటి ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన బోర్డు.. నిన్ను మాత్రం అలాగే ఉంచింది," అని షెహజాద్ మండిపడ్డారు. 90వ దశకంలోని దిగ్గజ ఆటగాళ్లతో నిన్ను నువ్వు పోల్చుకోవద్దని.. వారు నీకంటే ఎంతో మెరుగైన ప్రదర్శన ఇచ్చారని అహ్మద్ షెహజాద్ హితవు పలికారు.

షాదాబ్ మామ 'సక్లయిన్ ముస్తాక్' కూడా సీరియస్!
ఈ వివాదంలో షాదాబ్ మామ, మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ కూడా తన అల్లుడిని తప్పుపట్టారు. సీనియర్లను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. మరోవైపు పేసర్ మహమ్మద్ ఆమిర్ స్పందిస్తూ.. "నీకు ప్రదర్శన లేనప్పుడు నోరు మూసుకుని ఉండాలి. విమర్శలను నీ ఆటతో సమాధానం చెప్పాలే తప్ప, ఇలాంటి మాటలతో కాదు," అని ఘాటుగా స్పందించారు.

పీసీబీ వార్నింగ్
షాదాబ్ ఖాన్ ప్రవర్తనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ మేనేజర్ నవీద్ చీమా షాదాబ్‌ను పిలిచి మందలించినట్లు సమాచారం. భవిష్యత్తులో సీనియర్ల పట్ల ఇలాంటి భాషను వాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Story first published: Saturday, February 21, 2026, 14:22 [IST]
Other articles published on Feb 21, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+