Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెక్స్, డ్రగ్స్, అవినీతి, అక్రమ సంతానం: ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ భార్య

Sex, Drugs, Illegitimate Children, Corruption: Reham Khan on Ex-Husband Imran Khan

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రికె ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్‌ తన మాజీ భర్త గురించిన పలు వివాదాస్పద విషయాలను వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ వివాదాస్పద పుస్తకం విడుదలైంది. గత కొన్నాళ్లుగా ఈ పుస్కకంలోని కీలక అంశాలను లీక్ చేస్తూ వచ్చిన ఆమె గురువారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

ఇందులో తమ పది నెలల వైవాహిక జీవితం, ఇమ్రాన్ రాజకీయ, వ్యక్తిగత జీవితం గురించి ఇందులో వివరించింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆరుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. ఆయనకున్న సంతానం గురించి ఇమ్రాన్ తనకు వెల్లడించారని, ఈ విషయాలు ఆయన మొదటి భార్య జెమ్మిమా గోల్డ్‌ స్మిత్‌కు తెలుసని రెహమ్ తెలిపింది.

"ఇమ్రాన్‌‌కు సితా వైట్‌కు జన్మించిన టైరియన్‌ వైట్ గురించి మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో ఆయన టైరియన్‌ వైట్ ఒక్కతే కాదని, తనకు ఐదుగురు సంతానం ఉన్నారని అప్పుడు వెల్లడించాడు. వారిలో కొంతమంది భారతీయులు ఉన్నారని చెప్పారు" అని ఆమె తన పుస్తకంలో వెల్లడించింది. అలాగే ఆయనకున్న పిల్లల్లో అతి పెద్దవాళ్ల వయసు 34 ఏళ్లని చెప్పినట్లు ఆమె తన పుస్తకంలో పేర్కొంది.

అంతేకాదు ఇమ్రాన్‌తో సంతానం పొందినవారిలో కొందరు భారత మహిళలు కూడా ఉన్నారు. వాళ్లంతా తమ వైవాహిక జీవితంలో పిల్లలను కనలేకపోవడంతో తనతో సంతానం పొందినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పేవారని రెహమ్ వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్‌కు డ్రగ్స్ తీసుకొనే అలవాటు కూడా ఉన్నట్లు ఆ పుస్తకంలో రెహమ్ స్పష్టంచేసింది.

ఇమ్రాన్ ఖాన్ బాత్‌రూమ్‌లో కొకైన్ తీసుకుంటుండగా తాను చాలాసార్లు చూసినట్లు తెలిపింది. ఇంకా, చేతబడుల్లాంటి వాటిని కూడా ఇమ్రాన్ ఖాన్ నమ్ముతాడని వెల్లడించింది. తనకున్న దోషం పోవడానికి నల్లటి కందులతో ఇమ్రాన్ తన శరీరమంతా రుద్దుకోవడాన్ని తాను చూసినట్లు రెహమ్ ఆ పుస్తకంలో తెలిపింది.

ఇమ్రాన్ ఖాన్ స్వలింగ సంపర్కం కూడా చేసేవారని ఆమె తెలిపింది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ మోబీతో ఇమ్రాన్‌కు శారీరక సంబంధం ఉందని ఆమె పేర్కొంది. మోబీకి అప్పటికే పెళ్లి కూడా అయినట్లు పుస్తకంలో ఆమె వెల్లడించింది. ఇమ్రాన్ బెడ్‌రూమ్‌లో ఖాళీ సిగార్ కేసులు, కేవై జెల్లీ ట్యూబులు ఉండేవని అందులో పేర్కొంది.

జులై 25న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెహమ్ ఖాన్ వెల్లడించిన వివాదాస్పద విషయాలు ఇతర రాజకీయ పక్షాలకు ఆయుధాలుగా మారే అవకాశం ఉంది.

Story first published: Thursday, July 12, 2018, 18:55 [IST]
Other articles published on Jul 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+