వన్డే సిరీస్‌లో... భారత్ పుంజుకుంటుందా!

ఐతే ఇందుకు జట్టు లో మార్పులు చేర్పులు అవసరం అనే అభి ప్రాయమూ వినిపిస్తోంది. సీనియర్లలో సచిన్ టెండూల్కర్ ఆట తీరు మిగిలిన ఆటగాళ్లు ముఖ్యంగా యువకుల ఆటను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సచిన్ తన అనుభవాన్ని ఆటలో చూపాలి. రాహుల్ ద్రవిడ్ ఒక్కడే ఇపుడున్న జట్టులో ఆశావహంగా కనిపిస్తున్నాడు. రోహిత్ శర్మ విషయానికి వస్తే జట్టు ఆత్మవిశ్వాసం పెంచడంలో కీలకంగా నిలిచాడు. ఇటీవలి క్రికెట్ చరిత్రలో అత్యుత్తమంగా ఎదిగిన ఇంగ్లండ్ జట్టు మీద ఆడుతున్నామనే విషయాన్ని రోహిత్ సహా అంతా గుర్తుంచుకోవాలి. మిడిలార్డర్‌లో రోహిత్ సేవలు జుట్టకు ఉపయోగపడతాయి. వెస్టిండీస్ పర్యటనలో వెనుకబడిన విరాట్ కోహ్లి తనలోని పోరాట పటిమను ప్రదర్శించడానికి ఇంగ్లండ్ వన్డే సిరీస్ తగిన వేదిక.
బౌలింగ్ విభాగంలో తాజాగా ఎంపికైన వరుణ్ ఆరోన్ అదనపు బలంగా నిలువనున్నాడు. ఆరోన్‌ను ఎంపిక చేయాలంటూ మాజీ కెప్టెన్ సౌరవ్‌గంగూలీ గట్టి ఒత్తిడి తెచ్చిన సంగతి గమనార్హం. ఐపిఎల్‌లో సత్తా చాటిన ఆరోన్‌కు ఇంగ్లండ్ పరిస్థితులు ఎలాంటి పరీక్ష పెడతాయి, ఆ పరీక్షల్లో ఆరోన్ రాణిస్తాడా అనేది వేచి చూడాలి. సురేష్ రైనా మీద అదనపు భారం ఉంది. పాతతరం బ్యాటింగ్ లైనప్, నమ్మశక్యం కాని బౌలింగ్, స్పిన్‌లో లోపించిన పదును, పేలవమైన ఫీల్డింగ్, వికెట్ల మధ్య మదగజాలను తలపించే నడక వెరసి భారత జట్టుగా మారింది. సత్తా కలిగిన అంతర్జాతీయ జట్టును ఓడించడానికి ఏ లక్షణాలైతే ఉండకూడదో అవే లక్షణాలు ఇపుడు జట్టులో గూడుకట్టాయి. వీటన్నిటిని ఒకదాని వెంట ఒకటిగా తొలగించుకోవాల్సిన స్థితి ఇపుడు భారత్ జట్టుదే.
తొలి బంతి నుంచే దూకుడుగా ఆడగలిగిన వీరేంద్ర సెహ్వాగ్, పేస్‌కు తగిన రీతిలో స్పందించగలిగిన చతేశ్వర పూజార, శక్తిసామర్ధ్యాలున్న గౌతం గంభీర్‌ల ఆట తీరుకు సరైన మార్గనిర్దేశనం చేయాలి. వన్డే జట్టులోకి కోహ్లి వచ్చే అవకాశం ఉంది . కారణం మొదటి నుంచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దృష్టి విరాట్ మీద ఉంది. బౌలర్ల వరుస చూస్తే శ్రీశాంత్, ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్, ఆర్పి సింగ్, మిశ్రాల్లో వన్డే అవసరాలు తీర్చే బౌలర్లను ఎంపిక చేయాలి. కానీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల మీద భారత సెలక్టర్లు తొలి నుంచి బాగా నమ్మకాలు పెంచుకోవడం హాస్యాస్పదం. ముఖ్యంగా హర్భజన్ సింగ్ తన గత అనుభవాన్ని సత్తాను రాబోయే వన్డేల్లో తిరిగి చూపాల్సిన అవసరం ఉంది. ఇదే స్థాయిలో స్పిన్ బౌలింగ్ చేయగల మరొక బౌలర్‌ను తయారు చేసుకోవాల్సి ఉంది.
కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన డంకన్ ఫ్లెచర్ ఈ పరిస్థితులను భారత్‌కు ఎలా అనుకూలంగా మలుస్తాడనేది మిలియను డాలర్ల ప్రశ్నగా ఉంది. ఒక రకంగా కోచ్‌గా ఫ్లెచర్‌కు ఇది అత్యంత విషాదకర ప్రారంభంగా చెప్పాలి. మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టీన్ మాటల్లో చెప్పాలంటే ఫ్లెచర్ బాగా అనుభవం గడించిన వాడే. అయితే ఈ అనుభవాన్ని భారత జట్టు విజయావకాశాలుగా మరల్చడం ఫ్లెచర్‌కు అసలు సిసలు సవాలు విసరనుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications