బాక్సింగ్ డే టెస్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుల్లి కెప్టెన్ (వీడియో)

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ బాక్సింగ్ డే టెస్టులో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు గౌరవ కెప్టెన్‌గా ఓ బుడతడు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ బుడతడు ఎవరు అన్న సందేహం చాలా మందికి కలిగింది. అతడి పేరు ఆర్చీ షిల్లర్. వయసు ఏడేళ్లు. ఆర్చీ షిల్లర్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతనికి ఏకంగా 13 సర్జరీలు జరిగాయి. షిల్లర్ మూడు నెలల వయసు ఉన్నపుడే అతని గుండె కవాటాలు సరిగా లేనట్లు గుర్తించారు.

బాక్సింగ్ డే టెస్ట్‌కు ఆహ్వానం
ఆస్ట్రేలియా టీమ్ ప్రత్యేకంగా అతన్ని బాక్సింగ్ డే టెస్ట్‌కు ఆహ్వానించింది. క్రికెట్ అంటే షిల్లర్‌కు పిచ్చి ప్రేమ. మేక్‌ఏవిష్ ఫౌండేషన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్.. ఇండియాతో సిరీస్‌కు ముందు అతనితో వీడియో కాల్‌లో మాట్లాడి బాక్సింగ్ డే టెస్ట్‌కు ఆహ్వానించాడు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన షిల్లర్
ఇరు జట్ల మధ్య బుధవారం బాక్సింగ్ డే టెస్టు ప్రారంభ సమయంలో షిల్లర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మ్యాచ్‌కు ముందు షిల్లర్ తన అభిమాన క్రికెటర్ నాథన్ లియాన్ చేతుల మీదుగా బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా అందుకున్నాడు. బ్యాగీ గ్రీన్ క్యాప్ అందుకోగానే అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ట్విటర్‌లో వీడియోని షేర్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
షిల్లర్‌కు సంబంధించిన ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా, బుధవారం టాస్ వేసేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌తో కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఇరు జట్లు జాతీయ గీతాలాపన చేసే సమయంలో కెప్టెన్ టిమ్ పైన్ పక్కనే ఉన్నాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 215/2
కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76), ఛటేశ్వర్ పుజారా (68) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 215/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా(68), విరాట్ కోహ్లీ (47) పరుగులతో క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications