
హైదరాబాద్: ఫిబ్రవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం భారత జట్టుని ఇంకా ఎంపిక చేయని సంగతి తెలిసిందే. ఇటీవలే వన్డే సిరిస్‌కు జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు టెస్టు సిరిస్ కోసం జట్టుని ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై క్లారిటీ కోసం జట్టు ఎంపికని వాయిదా వేశారు.
అయితే, హార్దిక్ పాండ్యా ఇంకా వెన్నుగాయం నుంచి కోలుకోపోవడంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. "పాండ్యా సర్జరీ తర్వాత ఎన్‌సీఏ ఫిజియో ఆశిష్ కౌశిక్‌తో కలిసి మెడికల్ రివ్యూ కోసం లండన్‌కు వెళ్లాడు. కానీ ఇంకా మ్యాచ్‌లు ఆడటానికి హార్దిక్‌కు సమయం ఉందని డాక్టర్ జేమ్స్ అల్లీబోన్ తెలిపారు. ఫిట్‌నెస్ సాధించే వరకూ ఎన్‌సీఏలో ఆటగాళ్ల పునరావాస శిబిరంలోనే ఉంటాడు" అని అందులో పేర్కొంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో చివరిగా భారత్‌కు ఆడిన హార్దిక్ వెన్ను గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత లండన్‌లో హార్దిక్ పాండ్యాకు సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం పాండ్యా కోలుకోవడంతో ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి న్యూజిలాండ్-ఏ జట్టుతో వన్డే సిరిస్‌కు ఇండియా ఎ జట్టులో అతడికి చోటు కల్పించారు.
కానీ చివరి నిమిషంలో ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో హార్దిక్ వైదొలగడంతో అతని స్థానంలో స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. కాగా, న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ కల్లా పాండ్యా ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించారు. అయితే, పాండ్యాకు సర్జరీ చేసిన డాక్టర్ విశ్రాంతి అవసరమని సూచించడంతో కివీస్ పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు.