Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెడ్డిట్ కో ఫౌండర్‌తో సెరెనా విలియమ్స్ ఎంగేజ్‌మెంట్

హైదరాబాద్: టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ త్వరలో పెళ్లి కూతురు కానుంది. రెడ్డిట్ కో ఫౌండర్ అలెక్సిస్ ఒహనియన్‌తో త్వరలో నిశ్చితార్ధం చేసుకుంటున్నట్లు సెరీనానే స్వయంగా గురువారం ప్రకటించింది. రెడ్డిట్ వెబ్‌సైట్ కో ఫౌండర్ అయిన అలెక్సిస్ ఒహనియన్ తో సెరెనా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

సెరెనా విలియమ్స్ వయసు 35 ఏళ్లు కాగా, అలెక్సిస్ ఒహనియన్‌ వయసు 33 ఏళ్లు. తనకంటే రెండేళ్లు చిన్నవాడైన ఒహనియన్‌‌తో నిశ్చితార్ధం జరగనుందని విలియమ్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.

రోమ్‌లో తొలిసారి తాము అనుకోకుండా కలుసుకున్న చోటే మళ్లీ ఇప్పుడు ప్రత్యేకంగా కలుసుకున్నామని, ఈసారి అలెక్స్‌ పెళ్లి ప్రతిపాదన తేగా తాను అంగీకరించానని సెరెనా పేర్కొంది. ఆమె అంగీకారం తనని ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడిని చేసిందంటూ అలెక్స్‌ వెంటనే సమాధానం ఇచ్చాడు.

 Serena Williams Announces Engagement On Reddit, To Its Co-Founder

డబ్ల్యూటీఏ టూర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సెరెనా విలియమ్స్‌కు ఒహనియన్‌ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలపడం ద్వారా వీరిద్దరి పరిచయం మొదలైంది. ఈ పరిచయం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది. తన టెన్నిస్ కెరీర్‌లో సెరెనా విలియమ్స్ 71 సింగిల్స్ టైటిళ్లను సాధించింది.

22 గ్రాండ్ స్లామ్స్ సింగిల్ టైటిళ్లను సాధించిన స్టెఫీ గ్రాఫ్ రికార్డుని సైతం సెరెనా విలియమ్స్ సమం చేసింది. అంతేకాదు టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 186 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న అరుదైన రికార్డుని సైతం సొంతం చేసుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+