ప్రేయసితో దిగిన ప్రైవేట్ ఫోటోలు ఆన్‌లైన్‌లో: జైలుపాలైన క్రికెటర్
హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ అర్ఫాత్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రేయసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ దేశ పోలీసులు ఆదివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కొన్నిరోజుల క్రితం తన గర్ల్ ప్రెండ్ ఫోటోలను అర్ఫాత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీనిపై అర్ఫాత్ గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆదివారం ఢాకాలోని ఆర్ఫాత్ ఇంటిలో సోదాలు నిర్వహించిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ చీఫ్ జమలుద్దీన్ మిర్ తెలిపారు. తన గర్ల్ ఫ్రెండ్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన అర్ఫాత్ వారిద్దరూ ప్రైవేట్‌గా ఉన్న సమయంలో దిగిన కొన్ని అభ్యంతకర ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదుతో అర్ఫాత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
దీనిపై అర్ఫాత్ గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్ట్ చేసినట్లు మిర్ తెలిపారు. ఈ కేసులో అతడిని కోర్టుకు అప్పగించామని, అతనిపై పూర్తిస్తాయిలో విచారణ చేపట్టేందుకు ఐదు రోజులు కస్టడీకి కోరనున్నట్లు ఆయన తెలిపారు.

సన్నీ దోషిగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష
ఈ కేసులో అర్ఫాత్ సన్నీ దోషిగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ.86 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ఇంటర్నెట్ నిబంధనల ప్రకారం వివాదాస్పద ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారికి కఠిన శిక్షను అమలు చేస్తున్నారు.

ఇది పూర్తిగా అతని వ్యక్తిగత వ్యవహారం
క్రికెటర్ జైలు పాలవడంపై మాట్లాడేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు నిరాకరించింది. 'ఇది పూర్తిగా అతని వ్యక్తిగత వ్యవహారం. ఈ వ్యవహారంపై ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నాం' అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ నజముద్దీన్ చౌదరి పేర్కొన్నారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఢాకా మెట్రోపోలిస్ జట్టు ప్రాతినిధ్యం
బంగ్లాదేశ్ తరుపున 16 వన్డేలాడి 24 వికెట్లు తీసుకున్న అర్ఫాత్, 10 టీ20లాడి 12 వికెట్లు తీసుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా అతడి బౌలింగ్ యాక్షన్ ఉందని 2016 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సందర్భంగా అర్ఫాత్‌పై ఐసీసీ నిషేధం విధించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఢాకా మెట్రోపోలిస్ జట్టు తరుపున ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications