సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA0)లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సంచలన విజయాలు నమోదు చేస్తుంది. బుధవారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. అంతేగాక బోనస్ పాయింట్ సంపాదించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 15.2 ఓవర్లలోనే 78 పరుగులకు కుప్పకూలింది. రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డేనియల్ వోరాల్ ధాటికి కెప్టెన్ డుప్లెసిస్, రీజా హెండ్రిక్స్ డకౌటయ్యారు. డుప్లూయ్ (18; 12 బంతుల్లో), మాడ్సెన్ (32; 23 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయారు.

డేనియల్, పాట్రిక్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. జేన్సన్, బేయర్స్ తలో రెండు వికెట్లు తీశారు. సూపర్ కింగ్స్ జట్టులో డుప్లూయ్, మాడ్సెన్, బ్రాసెవెల్ (12; 10 బంతుల్లో) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు.ముగ్గురు డకౌటవ్వగా, మరో ముగ్గరు ఒక్క పరుగే సాధించారు. అనంతరం ఛేదనకు వచ్చిన సన్‌రైజర్స ఈస్టర్న్ కేప్ ఒక్క వికెట్ కోల్పోయి 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.
ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా ఆరంభించిన జోర్డాన్ హెర్మాన్ (11; 14 బంతుల్లో) అయిదో ఓవర్‌లో ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ అబెల్ (26*; 20 బంతుల్లో)తో కలిసి డేవిడ్ మలన్ (40; 32 బంతుల్లో) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించాడు. వీరిద్దరు మంచి బంతుల్ని గౌరవిస్తూ పరుగులు సాధించారు. మలన్ అయిదు బౌండరీలు, ఒక సిక్సర్ బాదగా, అబెల్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. కాగా, సన్‌రైజర్స్‌తో పాటు డర్బన్ సూపర్ జెయింట్స్, పార్ల్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 6 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.