Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL : అరుదైన రికార్డులపై భారత ఆటగాళ్ల కన్ను.. బద్దలు కొట్టేస్తారా?

senior players will break these records in INDvsSl series

తమ కెరీర్‌లో కీలకమైన కొన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు టీమిండియా స్టార్లు రెడీ అవుతున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే శ్రీలంకతో వన్డే సిరీస్ దీనికి వేదిక కానుంది. కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈసారి కూడా అందరి దృష్టినీ ఆకర్షించనున్నారు. ఈ క్రమంలో ఈ వన్డే సిరీస్‌లో కీలకమైన రికార్డులు బద్దలు కొట్టేందుకు సీనియర్ ఆటగాళ్లు రెడీ అవుతున్నారు.

షమీ ఆ రికార్డు సాధించేనా?

షమీ ఆ రికార్డు సాధించేనా?

శ్రీలంకతో సిరీస్ ఆడుతున్న భారత జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ. భారత్ తరఫున అద్భుతంగా రాణించిన షమీ.. వన్డే ఫార్మాట్‌లో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో 82 వన్డే మ్యాచులు ఆడిన షమీ 152 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడు.

అతని యావరేజ్ 25.7 కాగా, ఎకానమీ 506 కావడం గమనార్హం. అయితే శ్రీలంకతో సిరీస్‌లో కనుక అతను కనీసం 6 వికెట్లు తీసుకుంటే.. భారత్ తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ టెన్ బౌలర్ల జాబితాలోకి షమీ దూసుకొస్తాడు. ఈ క్రమంలో మాజీ లెజెండ్ మనోజ్ ప్రభాకర్‌ను దాటేసి పదో స్థానానికి చేరుకుంటాడు.

 మరో మైలురాయికి చేరువలో రోహిత్

మరో మైలురాయికి చేరువలో రోహిత్

టీమిండియా సారధి రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్‌లో కీలకమైన మైలురాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తన కెరీర్‌లో 228 వన్డే మ్యాచులు ఆడిన అతను 46 హాఫ్ సెంచరీలు, 29 సెంచరీలు సాధించాడు. ఈ మూడు వన్డేల్లో ఒక్క మ్యాచ్‌లో అయినా సరే రోహిత్ సెంచరీ సాధిస్తే.. అతని సెంచరీల సంఖ్య 30కు చేరుతుంది.

వన్డే ఫార్మాట్లో బెస్ట్ బ్యాటర్లలో ఒకడైన రోహిత్.. ఈ ఫీట్ సాధిస్తే తమ కెరీర్‌లో 30 వన్డే సెంచరీలు సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (49), విరాట్ కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30) మాత్రమే ఈ ఘనత సాధించారు.

కోహ్లీ ఆ రికార్డు కూడా..

కోహ్లీ ఆ రికార్డు కూడా..

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ బ్యాటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో మరో అరుదైన ఘనత సాధించేందుకు ఎదురు చూస్తున్నాడు. అన్నీ సక్రమంగా జరిగితే శ్రీలంక సిరీస్‌లోనే అతను ఈ ఘనత అందుకోవచ్చు. ఇప్పటి వరకు 256 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ 12,471 పరుగులు చేసి ఉన్నాడు.

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ శ్రీలంక సిరీస్‌లో కనుక అతను 180 పరుగులు సాధిస్తే.. లంక లెజెండ్ మహేల జయవర్దనే (12,650)ను దాటేస్తాడు.

మూడు మ్యాచుల్లో 180 పరుగులు చేయడం కొంచెం కష్టమే అయినా.. కోహ్లీ ఫామ్ అందుకుంటే ఎంత నిలకడగా ఆడతాడో అందరికీ తెలిసిందే. దానికితోడు శ్రీలంకపై అతని రికార్డు కూడా అద్భుతంగానే ఉంది. దీంతో ఈ రికార్డును కూడా కోహ్లీ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Story first published: Tuesday, January 10, 2023, 11:28 [IST]
Other articles published on Jan 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+