న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలక్షన్ ప్రివ్యూ: కోహ్లీ స్థానంలోకి అయ్యర్, ఇండియా-ఏ పర్యటకు షా, మావి

By Nageshwara Rao
Selection Preview: Shreyas Iyer may replace Kohli for Afghan Test; Prithvi, Mavi for India A tour

హైదరాబాద్: జూన్ 14న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆప్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో యువ ఆటగాడు, ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారిస్తోన్న శ్రేయాస్‌ అయ్యర్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆప్ఘన్‌తో ఏకైక టెస్టుకు కోహ్లీ దూరం

ఆప్ఘన్‌తో ఏకైక టెస్టుకు కోహ్లీ దూరం

ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులు అలవాటుపడేందుకు గాను కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు విరాట్‌ కోహ్లీ జూన్‌లో ఇంగ్లాండ్‌ వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంతో విరాట్ కోహ్లీ ఆప్ఘనిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుతో పాటు ఐర్లాండ్‌తో జరగనున్న వన్డే సిరిస్‌కు అందుబాటులో లేకుండా పోతున్నాడు.

కోహ్లీ స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్

కోహ్లీ స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్

దీంతో కోహ్లీ స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్ పేరును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘కోహ్లీ స్థానంలో శ్రేయస్‌, జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌, హార్డిక్‌ పాండ్యా బదులు విజయ్‌ శంకర్‌ పేర్లు సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ఆప్ఘన్‌తో ఏకైక టెస్టుకు కెప్టెన్‌గా రహానే

ఆప్ఘన్‌తో ఏకైక టెస్టుకు కెప్టెన్‌గా రహానే

ఇదిలా ఉంటే ఆప్ఘన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు అజ్యింకె రహానేకి కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న ఛటేశ్వర్ పుజారా, ఇషాంత్‌ శర్మ అప్ఘన్‌ టెస్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐర్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించే అవకాశం ఉంది.

భారత్‌-ఏ పర్యటకు షా, మావి

భారత్‌-ఏ పర్యటకు షా, మావి

ఇదిలా ఉంటే జులై మొదటి వారంలో విరాట్ కోహ్లీ టీమిండియాతో కలవనున్నాడు. ఇక, ఇంగ్లాండ్‌లో భారత్‌-ఏ పర్యటన కోసం ఆటగాళ్ల ఎంపిక ఉండనుంది. అండర్‌-19 ఆటగాళ్లు పృథ్వీషా, శుభ్‌మన్‌ గిల్‌, శివమ్‌ మావి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌ లయన్స్‌ (ఏ జట్టు), వెస్టిండీస్‌ ఏ జట్లతో భారత్‌-ఏ ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడనుంది.

Story first published: Monday, May 7, 2018, 18:14 [IST]
Other articles published on May 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X