Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెప్పాల్సింది చెప్పారు..నేనేమీ మాట్లాడను: కోహ్లీ

India vs West Indies 2018 : Virat Kohli Says Team Selection Isn't In My Hands
Selection is not my job: Virat Kohli on Karun Nair omission

న్యూ ఢిల్లీ: త్రిశతక వీరుడు కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకోకపోవడం పట్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌పై ఎందుకింత వివక్ష చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఈ వివాదంపై మాట్లాడడానికి ఏమీ లేదని అతను అన్నాడు. జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేయడం సెలక్టర్ల పనంటూ గుర్తు చేశాడు.

చెప్పాల్సింది చెప్పారు..నేనేమీ మాట్లాడను

చెప్పాల్సింది చెప్పారు..నేనేమీ మాట్లాడను

వెస్టిండీస్‌తో గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌కు ముందు కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఓ అంశంపై ఓ వ్యక్తి ఇప్పటికే మాట్లాడిన తర్వాత దానిని మళ్లీ ఇక్కడ అడగొద్దు. 'సెలక్టర్లు ఇప్పటికే దీనిపై చెప్పాల్సింది చెప్పారు. నేనేమీ మాట్లాడను. సెలక్టర్లు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. బయటి వాళ్లు ఏమంటున్నారనే దానితో సంబంధం లేకుండా ఎవరి పని వాళ్లు చేస్తున్నారు' అని కోహ్లి చెప్పాడు.

జట్టు ఎంపిక నా పని కాదు.

జట్టు ఎంపిక నా పని కాదు.

చీఫ్ సెలక్టర్ ఆ ప్లేయర్‌తో ఇప్పటికే మాట్లాడాడు. ఇక నేనేమీ మాట్లాడను. జట్టు ఎంపిక నా పని కాదు. టీమ్‌గా మేము ఏం చేయాలో అది చేస్తున్నాం అని కోహ్లి అన్నాడు. ప్రతి అంశాన్ని ఒక దానితో కలపొద్దు. అన్ని నిర్ణయాలు ఒకే స్థానం నుంచి జరుగుతున్నాయని అనుకుంటున్నారు. అది సరి కాదు అని కోహ్లి స్పష్టంచేశాడు. నిజానికి ఇండియా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్ అయిన కరుణ్ నాయర్‌ను టీమ్‌లోకి తీసుకోక పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

కరుణ్‌ను కాకుండా తర్వాత హనుమ విహారికి

కరుణ్‌ను కాకుండా తర్వాత హనుమ విహారికి

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఇంగ్లాండ్ టూర్‌లోనూ మొదటి నుంచీ జట్టుతోపాటు ఉన్న కరుణ్‌ను కాకుండా తర్వాత వచ్చిన హనుమ విహారికి అరంగేట్రం చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు వెస్టిండీస్‌తో సిరీస్‌కు అసలు ఎంపిక చేయలేదు. దీనిపై స్పందించిన కరుణ్ నాయర్ తాను ఈ ఎంపిక పట్ల చాలా నిరుత్సాహానికి గురైయ్యానని తెలిపాడు.

నా బ్యాట్‌తోనే జవాబిస్తా

నా బ్యాట్‌తోనే జవాబిస్తా

అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. వచ్చినప్పుడు వీటన్నిటికీ తగిన విధంగా నా బ్యాట్‌తోనే జవాబిస్తా అని వివరించాడు. కరుణ్‌ను ఎంపికచేసుకోకపోవడంపై ఇప్పటికే ఎమ్మెస్కే ప్రసాద్ సైతం మీడియా ముఖంగా వివరణ ఇచ్చాడు.

Story first published: Wednesday, October 3, 2018, 16:06 [IST]
Other articles published on Oct 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+