హ్యాపీ బర్త్‌డే మిస్టర్ హెలికాప్టర్: ధోనికి సెహ్వాగ్, యువీ స్పెషల్ మెసేజ్
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరుగాంచిన వ్యక్తి. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనాన్ని కోల్పోకుండా చిరునవ్వుని తన పెదవి మీద చిందించే కెప్టెన్ కూల్. సహచర ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపే కోచ్. కీపర్‌గా వికెట్ల వెనుకాల అతనికి అతనే సాటి.
క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన యార్కర్ బంతిని సిక్సర్‌గా మలిచే మిస్టర్ హెలికాప్టర్.. ఇలా ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. గురువారం (జులై 7) మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. నేటితో 35 ఏళ్లు పూర్తి చేసుకుని 36వ పడిలోకి అడుగుపెట్టాడు.
అంతేకాదు భారత్ జట్టులోకి అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అనూహ్య పరిస్థితుల మధ్య పరిమిత ఓవర్ల కెప్టెన్సీని అందుకున్న ధోని భారత్‌కు వరల్డ్ టి20 ప్రపంచకప్ అందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ధోని అందించిన విజయాలు మనందరికీ తెలిసిందే.
టెస్టు కెప్టెన్సీ అందుకున్న తర్వాత టీమిండియాను నెంబర్ వన్ ర్యాంకులో నిలిపాడు. సచిన్ టెండూల్కర్ మదిలో అందని ద్రాక్షగా నిలిచిన వన్డే వరల్డ్ కప్‌ని కానుకగా అందించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాడు. ఇలా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించి పెట్టిన ఏకైక కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించాడు.

బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా ఎన్నో రికార్డులు
బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత విజయవంతంమైన భారత కెప్టెన్‌గా ధోని ఓ అరుదైన రికార్డు సాధించాడు. 27 టెస్టు విజయాలతో సౌరవ్ గంగూలీ (21)ని అధిగమించాడు. మొత్తం 90 టెస్టులు ఆడిన ధోనీ 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. 6 సెంచరీలు, 33 అర్థసెంచరీలు ఉన్నాయి.

ధోని ట్రాక్ రికార్డు ఇదీ
అలాగే ధోనీ వన్డేల్లో 110, టి20ల్లో 41 విజయాలు ఓ భారత్ కెప్టెన్‌కు అత్యధిక విజయాలు. టెస్టుల్లో తనదైన ముద్ర వేయలేకపోయినా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 296 వన్డేలు ఆడిన ధోనీ.. 51.32 సగటుతో 9496 పరుగులు చేశాడు. 10 సెంచరీలు, 64 అర్థ సెంచరీలు ఉన్నాయి.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్ ధోనీ. ఓ వ్యక్తిగా, మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా ధోనీని ఇష్టపడని క్రికెటర్ ఉండటంటే అతిశయోక్తి కాదు. అందుకే యువరాజ్ సింగ్ విషయంలో ఎన్ని వార్తలు వచ్చినా.. నిందించినా.. యువీ మాత్రం ఎప్పుడూ ధోనీని వెనకేసుకునే వచ్చాడు. తాజాగా గురువారం 36వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోని గురించి యువరాజ్ ఓ ఆశక్తికర ట్వీట్ చేశాడు. ‘ఇలాంటి రోజులు ఎన్నో గడుపుకోవాలి మిస్టర్ హెలికాప్టర్' అంటూ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
ధోని పుట్టినరోజు నాడు సెహ్వాగ్ తనదైన శైలిలో
ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. హెలికాప్టర్ ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి.. మా గుండెల్లో ల్యాండవుతూ ఉండాలని సెహ్వాగ్ తనదైన శైలిలో ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications