For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దంబుల్లా వన్డేలో న్యూజిలాండ్ పై సెహ్వాగ్ సెంచరీ

By Pratap
Virender Sehwag
దంబూల్లా: ముక్కోణపు సిరీస్ లో భాగంగా బుధవారం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఓ వైపు వికెట్లు పడిపోతున్న భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడును ఆపలేదు. దంబుల్లా వన్డేలో సెంచరీ చేసి మరోసారి తన సత్తాను చాటాడు. నిర్ణీత 50 ఓవర్లలో 32.5 ఓవర్లు ముగిసే సరికి సెహ్వాగ్ 110 పరుగులు చేశాడు. వన్డేల్లో వేయి ఫోర్లు కొట్టిన ఏడో బ్యాట్స్ మన్ గా కూడా సెహ్వాగ్ రికార్జు సృష్టించాడు. దినేష్ కార్తిక్ (0), విరాట్ కోహ్లీ (8), యువరాజ్ సింగ్ (6), సురేష్ రైనా (1) వెంటవెంటనే అవుటైనా సెహ్వాగ్ గుండె జారిపోకుండా న్యూజిలాండ్ బౌలర్లను చితకబాదాడు.

సెహ్వాగ్ కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చక్కటి సహకారం అందించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్ ముక్కోణపు వన్డే పోటీల్లో భారత్ కు అత్యంత కీలకమైంది. ధోనీ 31 పరుగులతో నాటవుట్ గా ఉన్నాడు. 32.5 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. సెహ్వాగ్ మ్యాక్యులం బౌలింగ్ లో 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ధోనీకి రవీంద్ర జడేజా తోడయ్యాడు. ఈ మ్యాచులో భారత్ రెండు మార్పులు చేసింది. రోహిత్ శర్మను, ఓజాను తీసేసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+