Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Umran Malik : మేనేజ్‌మెంట్‌తో ఉమ్రాన్ గొడవ పడ్డాడా?.. అందుకే ఛాన్సులు ఇవ్వడం లేదా?

గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున అద్భుతంగా రాణించిన ప్లేయర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒకడు. తన అద్భుతమైన పేస్‌త ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన ఉమ్రాన్.. తన ప్రతిభతో టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మరోసారి రాణించి, మళ్లీ భారత జట్టులో చేరతాడని అంతా అనుకున్నారు.

కానీ అసలు ఈ ఐపీఎల్‌లో ఆడే అవకాశమే అతనికి సరిగా రాలేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొని పరువు కోసం ఆడుతున్న సన్‌రైజర్స్.. ఈ ఏడాదిలో ఉమ్రాన్‌కు సరిగా అవకాశాలు ఇవ్వలేదు. అతను ఈ సీజన్‌లో కేవలం 7 మ్యాచులే ఆడి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తమ చివరి రెండు లీగ్ మ్యాచుల్లో అయినా అతన్ని సన్‌రైజర్స్ ఆడిస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు.

Sehwag thinks Umran Malik had a fight with SRH management

కానీ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఉమ్రాన్ ఆడలేదు. ఇదేంటని ఆ టీం కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్‌ను అడిగితే.. తెర వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని, ఉమ్రాన్ ఎందుకు ఆడటం లేదో తనకు ఐడియా లేదని అన్నాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాయి. కెప్టెన్‌కు కూడా ఏం తెలియడం లేదంటే.. ఆ ఫ్రాంచైజీలో ఏదో సమస్య ఉందన కొందరు నిపుణులు వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. 'మైదానం బయట నీ జీవితంతో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. అది నీ లైఫ్ అని నేను నమ్ముతా. అయితే మైదానంలో దిగిన తర్వాత మాత్రం మంచి ప్రదర్శన చేయాలి. దాని కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావ్ అనేది కూడా ముఖ్యమే' అని వెల్లడించాడు. ఈ క్రమంలోనే తను కోచింగ్ ఇచ్చిన రోజుల గురించి మాట్లాడాడు.

'నేను కోచ్, మెంటార్‌గా ఉన్నప్పుడు ఒకటే నమ్మేవాడిని. నువ్వు గ్రౌండ్‌లో దిగితే నూటికి నూరు శాతం ఎఫర్ట్ చూపించాలి. అలా చేస్తుంటే మైదానం బయట నువ్వు ఏం చేసినా నాకు పట్టదు. అది నీ లైఫ్ నీ ఇష్టం. అసలు మార్క్రమ్ చెప్పిన తెర వెనుక ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. టీం మేనేజ్‌మెంట్‌తో ఉమ్రాన్ ఏమైనా గొడవ పడ్డాడేమో? ఏమైనా అనేశాడేమో? ఒక వేళ అదే జరిగి ఉంటే అది కరెక్ట్ కాదు' అని సెహ్వాగ్ అన్నాడు.

'నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు.. సరిగా రాణించకలేదు అనుకో మరో అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత సూపర్‌గా పెర్ఫామ్ చేసి ఎదుటి వాళ్ల నోళ్లు మూయించాలి' అని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. సన్‌రైజర్స్ తన చివరి లీగ్ మ్యాచులో ముంబైతో తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో అయినా ఉమ్రాన్ ఆడతాడేమో చూడాలి.

Story first published: Saturday, May 20, 2023, 11:30 [IST]
Other articles published on May 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+