Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డెవిల్స్ కెప్టెన్సీకి సెహ్వాగ్ దూరం

Virender Sehwag
న్యూఢిల్లీ: గౌతం గంభీర్ కు అవకాశం కల్పిస్తూ డేషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బ్యాటింగ్ పై దృష్టి కేంద్రీకరించే ఉద్దేశంతో సెహ్వాగ్ కెప్టెన్సీనుంచి తప్పుకున్నాడు. తన నిర్ణయాన్ని అంగీకరించినందుకు సెహ్వాగ్ జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. తన బ్యాటింగ్ పై దృష్టి పెట్టి జట్టు తన బ్యాటింగ్ ద్వారా బలం చేకూర్చడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. ఢిల్లీ కెప్టెన్ గా, దక్షిణాఫ్రికాలో ఐపియల్ - 2లో డేర్ డెవిల్స్ జట్టుకు నాయకత్వం వహించడం ద్వారా గంభీర్ తన సమర్థతను నిరూపించుకున్నాడని సెహ్వాగ్ ప్రశంసించాడు.

సెహ్వాగ్ తప్పుకున్న నేపథ్యంలో కెప్టెన్సీకి గౌతం గంభీర్ పేరుతో సహా పలువురి పేర్లను జట్టు యజమాని జిఎంఆర్ పరిశీలించింది. అయితే గంభీర్ వైపే మొగ్గుచూపారు. దినేష్ కార్తిక్ వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. జట్టుకు సెహ్వాగ్ బలం, స్ఫూర్తి అని, సెహ్వాగ్ నిర్ణయాన్ని గౌరవించి అంగీకరించామని జిఎంఆర్ స్పోర్ట్స్ చైర్ పర్సన్ శ్రీనివాస్ బొమ్మిడాల అన్నారు. తనకు ఎంతో ఆనందంగా ఉందని గంభీర్ అన్నాడు. తనకు సెహ్వాగ్ మార్గదర్సి, మిత్రుడు అని అతను అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+