న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లకు #Sandesh2Soldiers హ్యాష్ ట్యాగ్ పేరిట దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో అడుగు ముందుకేసి #FaujiKoDekhoSaluteThoko అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి సైనికులతో దిగిన ఫొటోలను, సెల్ఫీలను ట్వీట్ చేయమంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

సెహ్వాగ్ పిలుపుకు విశేష స్పందన వస్తోంది. ఇందులో భాగంగా చాలా మంది ప్రజలు జవాన్లతో కలిసి దిగిన ఫోటోలను సెహ్వాగ్ ట్విట్టర్ హ్యాండ్లర్‌కు రీట్వీట్ చేస్తున్నారు. సెహ్వాగ్ తీసుకున్న ఈ శుభారంభానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా స్పందించడం విశేషం.
జవాన్లకు శుభాకాంక్షలు తెలపడం మాత్రమే కాదు, వారి క్షేమం కోసం కూడా ప్రార్థిద్దామని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమాని ఒకరు ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే దుర్విత్ షా అనే వ్యక్తి చేసిన ట్వీట్ బాగా ఆకట్టుకుంది. నేను సైనికుడితో సెల్ఫీ దిగలేదు కానీ ఈ ఫొటో పంపుతున్నా అంటూ ఓ ట్వీట్ చేశాడు.
అందులో త్రివర్ణ పతకానికి సెల్యూట్ చేస్తున్న జవాన్ ఫొటో ఉంది. ఇంతకంటే మంచి సెల్యూట్ ఏముంటందంటూ ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ రీట్వీట్ చేసిన మరికొన్ని ట్వీట్లు మీకోసం....