Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: ప్రజల ప్రేమను గెలిచాడు.. జనరేషన్‌కు ఒకే ఒక్కడు! నిన్ను కేవలం ప్రేమించగలం అంతే!!

Sehwag says MS Dhoni is Once In A Generation Player, See How Virat, Raina And Others Wished

హైదరాబాద్: ప్రపంచ గొప్ప కెప్టెన్ల‌లో ఒక‌డైన మెస్ ధోనీ బుధ‌వారం (జులై 7) త‌న 40వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్రికెటర్లు, ఐసీసీ, బీసీసీఐ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు అయితే ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి వ్యాపారవేత్తల వరకు.. ఇతర క్రీడా ప్రముఖుల నుంచి సాధారణ మహీకి ట్విటర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ త‌న కెరీర్‌లో అత‌ను తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌కు సంబంధించి ఓ వీడియో రూపొందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అత‌నికి బ‌ర్త్‌డే విషెస్ చెప్పింది. ఈ ఐదు నిమిషాల వీడియో 2007 టీ20 ప్రపంచకప్ ఫైన‌ల్‌తో మొద‌లైంది. ఆ ఫైన‌ల్ చివ‌రి ఓవ‌ర్‌ను జోగింద‌ర్ శ‌ర్మ‌లాంటి అనామ‌కుడితో వేయించాల‌ని ధోనీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం అద్భుతం. ఆ త‌ర్వాత కూడా ఇలాంటివే ఎన్నో అనూహ్య నిర్ణ‌యాలు కెప్టెన్‌గా ధోనీ తీసుకున్నాడు. ఇలాంటి నిర్ణ‌యాల‌తోనే 2007 టీ20 వ‌రల్డ్‌క‌ప్‌తోపాటు 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013 చాంపియ‌న్స్ ట్రోఫీలాంటి విజ‌యాలు సాధించిపెట్టాడు. ఆ వీడియోల‌న్నింటినీ సంక్షిప్తంగా ఐసీసీ ఇందులో పొందుప‌రిచింది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ప్రత్యేక ఫొటోతో ఎంఎస్ ధోనీ పుట్టునరోజు శుభాకాంక్షలు తెలిపింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ గెలిచిన ఫొటో పోస్ట్ చేసి విషెష్ చెప్పాడు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్.. మహీని ఆకాశానికే దేవుడివి అని పేర్కొన్నాడు. ధోనీ తన హిట్టింగ్‌తో చాలా మంది ప్రజల ప్రేమను గెలిచాడన్నాడు. ఆకాశాన్ని, భూమిని కూడా సంతోషపెట్టాడని, జనరేషన్‌కు ఒక ప్లేయర్ ధోనీ ని వీరూ ట్వీట్ చేశాడు.

'ఎంఎస్‌ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నాకు మిత్రుడు, సోదరుడు, మార్గనిర్దేశకుడు. మీ నుంచి అందరూ కోరుకునేది ఇదే. మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప ఆటగాడిగా, నాయకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు' అని టీమిండియా మాజీ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా ట్వీట్ చేశాడు.

మాలాంటి యువకులకు సౌరవ్ గంగూలీ ఎలా గెలవాలో బోధించారు. ఎంఎస్ ధోనీ దానిని ఒక అలవాటుగా మార్చేశాడు. వేర్వేరు తరాలకు చెందిన గొప్ప నాయకులు ఒక రోజు అంతరంతో పుట్టారు. భారత క్రికెట్‌ రూపురేఖలను మార్చేసిన మహీకి జన్మదిన శుభాకాంక్షలు- మహ్మద్‌ కైఫ్‌

నేనెప్పటికీ ప్రేమించే నా గొప్ప మిత్రుడు మహీ భాయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ గురించి ఎంత చేసినా, ఏం చెప్పినా తక్కువే. నిన్ను కేవలం ప్రేమించగలం అంతే- హార్దిక్‌ పాండ్యా

హ్యాపీ బర్త్‌డే ఎంఎస్‌ ధోనీ భాయ్‌. మీరే నాకు ఆదర్శం. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తి- కుల్దీప్ యాదవ్‌

మహీ భాయ్‌ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఒక మంచి మిత్రుడు, గొప్ప సారథి మీరు. ఈ ఏడాదంతా మీకు బాగుండాలి- ఇషాంత్‌ శర్మ

Story first published: Wednesday, July 7, 2021, 13:16 [IST]
Other articles published on Jul 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+