గేల్ నీకు ఏమైంది?, ట్వీట్లతో 30 లక్షలు సంపాదించా: సెహ్వాగ్
హైదరాబాద్: తన ఆటతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు, సంచలన నిర్ణయాలు, సెలబ్రిటీలకు తనదైన శైలిలో జన్శదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ కింగ్‌గా మారిపోయాడు.
ముఖ్యంగా సెహ్వాగ్ తన మార్కు ట్వీట్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మంచి హాస్య ప్రియుడుగా కూడా పేరొందాడు. ట్విట్టర్‌లో సెహ్వాగ్ వేసే చమత్కారాలు, ఛలోక్తులకు గాను గతేడాది కాలంలో ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. అర్ధరాత్రి బెడ్ మీద ఉండగా తన ట్వీట్లు చదివి పగలబడి నవ్వినట్లు రణ్‌వీర్ సింగ్ తెలిపినట్లు సెహ్వాగ్ గతంలో పేర్కొన్నాడు.

ట్వీట్లతో 30 లక్షలు సంపాదించా
అయితే ఈ ట్వీట్ల ద్వారా అభిమానులకు అనందాన్ని పంచడంతో పాటు సెహ్వాగ్ డబ్బు కూడా సంపాదిస్తున్నాడట. ఇలా గత 6నెలల్లో అతడు చేసిన ట్వీట్ల ద్వారా రూ.30లక్షలు సంపాదించినట్లు ఓ ఆంగ్ల పత్రికకు సెహ్వాగ్ స్వయంగా తెలిపాడు. తన ట్వీట్లు వైరల్‌గా మారడంతో స్పాన్సర్లు వారంతటవారే తనను సంప్రదిస్తున్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు.

జోకులు షేర్ చేయగానే వాటికి భారీ స్పందన
‘నేను ట్విటర్‌లోకి వచ్చి జోకులు షేర్ చేయగానే వాటికి భారీ స్పందన వస్తోంది. నా ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. నా పోస్టులు కొన్నింటికి వేలాది రీ ట్వీట్లు వస్తున్నాయి. ట్వీట్లకు ఎక్కువ షేర్స్ రావడంతో స్పాన్నర్ల నుంచి నగదూ వస్తోంది' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

హిందీలో సెహ్వాగ్ కామెంటరీ
ముఖ్యంగా టీమిండియా ఆడేటటువంటి చాలా మ్యాచ్‌లకు హిందీలో సెహ్వాగ్ కామెంటరీ చెప్తున్నాడు. ఈ క్రమంలో కామెంటేటరీలో సెహ్వాగ్ తన చమత్కారాలను ప్రదర్శించడంతో సహ వ్యాఖ్యాతలు ఎంతో మెచ్చుకుంటారు.
గేల్ నీకు ఏమైంది?: సెహ్వాగ్ ప్రశ్న
వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ ఆస్పత్రి పాలయ్యాడు. చేతికి డ్రిప్స్, నీడిల్స్‌తో ఆసుపత్రి బెడ్‌పై ఉన్నప్పుడు తీసుకున్న సెల్ఫీని గేల్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన వెంటనే సెహ్వాగ్ స్పందించాడు. ‘త్వరగా కోలుకో యూనివర్స్ బాస్. రాజు కచ్చితంగా కలకాలం ఉంటాడు. ఇంతకీ.. ఏమైంది నీకు?' అని ప్రశ్నించాడు.
తర్వాత చెబుతా
దానికి ‘నేను తర్వాత చెబుతా. కృతజ్ఞతలు' అంటూ గేల్ బదులిచ్చాడు. గాయం కారణంగా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)కు దూరమవ్వాల్సి వచ్చిందని గత నెలలో క్రిస్ చెప్పాడు. బహుశా ఆ గాయానికి చికిత్స చేయించుకునేందుకే అతను ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications