Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్‌లో నవ్వులు: సోధీకి వినూత్నంగా విషెస్ తెలిపిన సెహ్వాగ్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ట్విట్టర్‌లో నవ్వులు పూయిస్తూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాడు టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్. ట్విట్టర్‌లో తోటి క్రికెటర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంలో ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తున్నాడు.

Sehwag's birthday wishes to Reetinder Singh Sodhi will leave you disoriented

తాజాగా అలాంటి ప్రత్యేకతతో ఒక ట్వీట్‌ను పోస్టు చేశాడు. వివరాల్లోకి వెళితే మంగళవారం టీమిండియా మాజీ క్రికెటర్ రితీందర్‌ సోధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌ ట్విట్టర్‌లో తనదైన స్టైల్లో సోధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

'ఇండియాకి ప్రధానమంత్రి- మోడీ'
'ఢీల్లీలో బెస్ట్‌ గార్డెన్‌- లోధీ'
'ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలుడు- సోధీ'. 36వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సోధీకి సెహ్వాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ రాశాడు.

ఇక రితీందర్‌ సోధీ విషయానికి వస్తే 1980లో పంజాబ్‌లోని పటియాలాలో జన్మించాడు. భారత్ తరుపున 18 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. 2000లో టీమిండియా అండర్ 19 జట్టులో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. సోధీ సారధ్యంలోని టీమిండియా 1996లో అండర్ 15 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.

పంజాబ్‌కు చెందిన ఈ ఆల్ రౌండర్ బ్యాట్స్‌మెన్ 2000 సంవత్సరంలో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అనంతరం ఒడిషాలోని కటక్‌లో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2002లో జోధ్‌పూర్‌లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+