అప్పుడే కోహ్లీ గురించి తెలిసింది.. స్టార్ బ్యాటర్ గురించి ఆసక్తికర ఘటన చెప్పిన సెహ్వాగ్

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చెయ్యక విపరీతంగా విమర్శలపాలైన అతను.. ఆసియా కప్‌తో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. దాన్ని ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో కొనసాగిస్తున్నాడు. నూటికి నూరు శాతం జట్టు కోసం తపించే ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు.
శనివారం నాడు 34వ పడిలో అడుగుపెట్టిన అతను.. జట్టు సభ్యులతో కలిసి మెల్‌బోర్న్‌లో జరుపుకున్నాడు. ఆ తర్వాత జర్నలిస్టులతో కలిసి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్.. ఈ స్టార్ బ్యాటర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

కోహ్లీ గురించి అలా విన్నా..
తను ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ ఆడే సమయంలో అసిస్టెంట్ కోచ్‌గా అజిత్ చౌదరీ ఉండేవాడని సెహ్వాగ్ తెలిపాడు. ఆయనే తనకు కోహ్లీ గురించి మొదటి సారి చెప్పినట్లు వెల్లడించాడు. అజిత్ చౌదరీ కోచింగ్‌లో కోహ్లీ అండర్-16, అండర్-18 జట్లలో ఆడినట్లు సెహ్వాగ్ తెలిపాడు. 'ఒక మంచి ఆటాడు వస్తున్నాడు. తన పేరు విరాట్ కోహ్లీ. భవిష్యత్తులో తను కచ్చితంగా భారత్‌కు ఆడతాడు' అని అజిత్ చౌదరి చెప్పాడట.

ఫస్ట్ ఇంప్రెషన్..
కోహ్లీ గురించి తను మొట్టమొదట విన్న మాటలు గుర్తు చేసుకున్న సెహ్వాగ్.. తన మొదటి ఇంప్రెషన్‌ను కూడా వెల్లడించాడు. 'ఢిల్లీ తరఫున టీ20 టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ షాట్లు చూశా. లాంగాన్, లాంగాఫ్ మధ్యలోకి బంతి వెళ్లేలా బ్యాక్‌ఫుట్‌లో పంచ్ చేశాడు. బౌలర్‌కు చాలా దగ్గర నుంచి వెళ్లిన ఆ బంతిని ఇద్దరు ఫీల్డర్లు ఆపలేకపోయారు. అప్పుడే అనిపించింది.. ఈ కుర్రాడిలో ఏదో స్పెషల్ ట్యాలెంట్ ఉందని' అని పేర్కొన్నాడు.

అప్పట్లో వివాదాస్పద కామెంట్స్..
ఈ స్టార్ బ్యాటర్ గురించి మాజీ లెజెండ్, దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వీళ్లిద్దరూ 2011 వన్డే ప్రపంచకప్‌లో గెలిచిన జట్టులో సభ్యులు కావడం గమనార్హం. అంతేకాదు, ఇద్దరూ కూడా దేశవాళీల్లో ఢిల్లీ తరఫునే ఆడేవారు. ఏదున్నా ముక్కుసూటీగా మాట్లాడే సెహ్వాగ్.. కామెంటేటర్‌గా కోహ్లీపై చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఇంగ్లండ్‌తో ఆడిన టెస్టు మ్యాచ్‌లో డ్యాన్స్ చేస్తున్న కోహ్లీపై సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications