
హైదరాబాద్: భారత మాజీ ఓపెనర్, భారత జట్టు మాజీ క్రికెటర్ అయిన సెహ్వాగ్ ఐపీఎల్ ప్రమోషన్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్‌లో ఓ కొత్త అంశాన్ని జోడించారు. ఐపీఎల్ ప్లేయర్లను ఈ సారి ఓటింగ్ ద్వారా ఎన్నుకోవచ్చట. అంటే తమ అభిమాన ప్లేయర్‌ని ఏ జట్టుకు నప్పుతాడు అనుకుంటారో మనమే ఓటింగ్ ద్వారా తెలియజేయచ్చన్నమాట.
ఈ కార్యక్రమానికి ఎలక్షన్ సే సెలక్షన్ అనే పేరు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. అంటే ఎన్నికతో ఎంపిక అని అర్థం. గత ఐపీఎల్‌ను దాదాపు 700మిలియన్ అభిమానులు వీక్షించగా ఏ ఏడాది దాని దాటేసే దిశగా స్టార్ ఇండియా కొత్త మార్పులు చేయనుంది.
ఈ సారి ఐపీఎల్‌ను వీవో ఐపీఎల్‌గా నామకరణం కూడా చేసేశారు. ఈ సీజన్‌కు 30 మంది స్టార్ ఆటగాళ్లు, 20 మంది సాధారణ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.
ఐపీఎల్‌లో పదకొండో సీజన్ అయినటువంటి వీవో ఐపీఎల్‌ను మొట్ట మొదటి సారిగా స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్స్‌లు కలిసి పది ఛానెళ్లలో ప్రచారం చేయనున్నాయి. అవి హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో ప్రచారం అవనున్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.