ముంబైకి చేజేతులా మ్యాచ్ అప్పజెప్పారు.. ఫైర్ అయిన పీటర్సన్, సెహ్వాగ్

ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క విజయం సాధించగలిగితే ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టే దశలో గుజరాత్ టైటాన్స్ నిర్లక్ష్యంగా ఆడుతోంది. కేవలం ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌లోకి చేరిన తొలి జట్టుగా ఆ టీమ్ నిలుస్తుంది. కానీ అనసవర తప్పిదాలు, నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ జట్టుకు ఆ ఒక్క విజయం దక్కడం లేదు. శుక్రవారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడాన్ని చూస్తే గుజరాత్ జట్టు నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా అర్థమవుతుంది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (55), శుభ్‌మన్ గిల్ (52) హాఫ్ సెంచరీలతో 106పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించి శుభారంభమిచ్చారు. అంతమంచి శుభారంభం దక్కినా.. గుజరాత్ దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది. మురుగున్ అశ్విన్ వేసిన 13వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్, చివరి బంతికి వృద్ధిమాన్ సాహా ఔటయ్యాక మ్యాచ్ ను గెలిపించగల సత్తా ఉన్న బ్యాటర్లే ఉన్నా.. ఛేదనలో తడబడి గుజరాత్ ఓడిపోయింది.

42బంతుల్లో 66పరుగులు.. చేతిలో 8వికెట్లు
గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయేసరికి 112పరుగులు చేసింది. ఇంకా 42బంతుల్లో 66పరుగులు చేయాల్సి ఉంది. టీ20ల్లో ఇది చాలా ఈజీ విషయం. పైగా గుజరాత్ ప్లేయర్లలో బ్యాటర్లందరూ మ్యాచ్ విన్నర్లే. కానీ నిర్లక్ష్యమనే భూతం ఆవహించిన గుజరాత్ జట్టు అనవసరంగా వికెట్లు కోల్పోయింది. తొలుత సాయి సుదర్శన్ పొలార్డ్ బౌలింగ్లో సెల్ఫ్ ఔట్ అయి నిర్లక్ష్యాన్ని మొదలు పెడితే.. హార్దిక్ పాండ్యా రనౌట్ అయి దాన్ని కొనసాగించాడు. చివర్లో తెవాతీయా కూడా రనౌట్ అయి నిర్లక్ష్యానికి క్లైమాక్స్ తీసుకోచ్చాడు. అలాగే బంతులు ఆఫ్ సైడ్ వేస్తున్న మిల్లర్ క్రీజు నుంచి ఆఫ్ సైడ్ రాకుండా ముద్ద పప్పులా ఉన్న చోటు నుంచే హిట్టింగ్ చేయాలని చూసి ఆ నిర్లక్ష్యాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లాడు. ఇక చేజేతులా ముంబైకి మ్యాచ్ ను అప్పజెప్పారు. హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ లాంటి భారీ హిట్టర్లు ఉన్నా.. నిర్లక్షానికి తప్పదు భారీ మూల్యం అన్నట్లు ఈ మ్యాచ్ ఫలితం ఉంది.

నిరాశనే బ్యాటింగ్ చేస్తున్నట్లు
ఇక ఈ మ్యాచ్ అనంతరం పీటర్సన్ గుజరాత్ టైటాన్స్ నిర్లక్ష్యాన్ని ఏకిపారేశాడు. ఇది పూర్తి నిరాశజనిత ప్రదర్శన అని పేర్కొన్న కెవిన్.. వ్యంగ్యంగా క్వశ్చన్ మార్క్ తో గుజరాత్ బ్యాటర్లను నిలదీశాడు. అసలు నిరాశ ఏంటీ ఇలా ప్రవర్తించింది. టఫ్ రనౌట్లో డైవింగ్ చేయడానికి నిరాశ వెనకడుగు వేసింది. ఏమాత్రం డైవ్‌లు లేవు. కాస్త డైవ్ చేస్తే లైన్‌ను అధిగమించి.. ప్లేఆఫ్స్‌లో చోటు గ్యారెంటీ చేసుకోవాలనే విషయంలో నిరాశ తన పాత్ర పోషించింది. అంటూ గుజరాత్ బ్యాటర్లు రనౌట్ల సందర్భంగా డైవ్ చేయకపోవడాన్ని పీటర్సన్ సీరియస్‌గా ఖండించాడు. నిరాశనే బ్యాటింగ్ చేస్తుంది అనిపించేలా తన ప్రశ్నలను సంధించాడు.

తమ గొయ్యి తామే తవ్వుకున్నారు
ఇక టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో జీటీ ఓపెనర్లు ఫ్లాప్ అయితే బాగుండేది. వారు ఫ్లాప్ అయినప్పుడే గుజరాత్ గెలుపొందేది. ఇప్పుడు ఓపెనర్లు శుభారంభం ఇచ్చి మిడిలార్డర్ బ్యాటర్లను లూజ్ చేశారనిపించింది. అలాంటి శుభారంభం దక్కితే 2ఓవర్లు మిగిలి ఉండగానే గెలుపుతో ముగించాల్సింది. కానీ హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లు రనౌట్లయ్యారు. గెలవాల్సిన మ్యాచ్‌ను వారు ముంబైకి అప్పజెప్పారు' అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో సంభాషణలో పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications