Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జూలైలో పుట్టి టీమిండియాకు కెప్టెన్ అవ్వండి: జులై 9ని ఉద్దేశించి సెహ్వాగ్ ట్వీట్

Sehwag on Twitter says The missing 9th. A future India captain and icon will be born or celebrating his birthday

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్‌‌‌లో ఉంటోన్న సంగతి తెలిసిందే. మాజీ, ప్రస్తుత క్రికెటర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు తనదైన శైలిలో స్పందిస్తున్నాడు.

తాజాగా సెహ్వాగ్ చేసిన మరో ట్వీట్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ప్రధానంగా జూలై7న పుట్టినరోజు జరుపుకున్న ధోని, జూలై 8వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్న గంగూలీలను ఉదహరిస్తూ సెహ్వాగ్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ట్విట్టర్‌లో సెహ్వాగ్ "జూలై నెలలో పుట్టండి.. టీమిండియాకు కెప్టెన్‌ అవ్వండి" అంటూ ట్వీట్‌ చేశాడు.

సెహ్వాగ్ ట్వీట్‌లో మంగళవారం(జూలై 10) పుట్టినరోజు జరుపుకోబోతున్న టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ పేరును కూడా సెహ్వాగ్‌ ప్రస్తావించాడు. సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో "జూలై7 వ తేదీన ఎంఎస్‌ ధోని జన్మిస్తే, జూలై 8వ తేదీన సౌరవ్‌ గంగూలీ, జూలై 10న సునీల్‌ గవాస్కర్‌లు జన్మించారు. మధ్యలో జూలై9 మిస్సవడంతో, ఈ తేదీలో ఎవరు ఒకరు పుట్టి టీమిండియా భవిష్యత్తు టీమిండియా కెప్టెన్‌గా నిలవండి" అని పేర్కొన్నాడు.

Story first published: Monday, July 9, 2018, 13:41 [IST]
Other articles published on Jul 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+