జట్టుకు ఉపయోగం: సెహ్వాగ్‌కు కొత్త బాధ్యతలు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు కొత్తగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా ఉన్న టీమిండియా సెహ్వాగ్ ఇకపై జట్టు క్రికెట్ ఆపరేషన్స్, స్ట్రాటజీ విభాగం చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.
అదేవిధంగా పంజాబ్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా కుడా వ్వవహరిస్తాడని జట్టు యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. సెహ్వాగ్ అనుభవం, సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకం ఉందని, కొత్త పాత్రలో అతను రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు కింగ్స్ లెవెన్ ప్రాంఛైజీ పేర్కొంది.

జట్టు మెంటార్‌తో పాటు ఇతర బాధ్యతలను సెహ్వాగ్ చేపట్టడం గొప్ప విషయంగా భావిస్తున్నానని అన్నారు. మరోవైపు తనకు కొత్త బాధ్యతలు అప్పగించడంపై సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతిభావంతులైన యువకులకు మెంటార్‌గా వ్యవహరిస్తూ, జట్టును నడిపించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తన అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉందని, ఈ సీజన్‌లో జట్టును విజయపథంలో నడిపించడంపై దృష్టిసారిస్తున్నానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications